Today Telugu News Updates

కుక్కలు పీక్కుతింటున్న కరోనా శవాలు, Coronavirus dead body cremation

కుక్కలు పీక్కుతింటున్న కరోనా శవాలు, Coronavirus dead body cremation
కుక్కలు పీక్కుతింటున్న కరోనా శవాలు, Coronavirus dead body cremation

చనిపోయిన వారిని గౌరవించే గొప్ప సంస్కృతి మనది . అయితే Coronavirus dead body cremation కరోనా మహమ్మారితో చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు . అంత్యక్రియల నిర్వహణలోనూ దగ్గర ఉండలేని దుస్థితి . కరోనా సోకినా , ఆ వ్యాధితో మరణించినా అవస్థలు అంతా ఇంతా కావు , ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం , భయాందోళనల వల్ల కరోనా మృతులకు చివరికి అంతిమసంస్కారాలు సరిగా జరగడం లేదు .

 ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కరోనా మృతులను సామూహిక ఖననం చేస్తున్న వీడియోలు కంతటడి పెట్టించాయి . అలాంటి సంఘటనే హైదరాబాద్ సనత్ నగర్ శ్మశానవాటికలో జరిగింది . కరోనాతో చనిపోతే మతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తుండటంతో శరీర భాగాలను కుక్కలు పీక్కుతింటున్న అమానవీయ ఘటన ఇఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో చోటు చేసుకుంది . 

Coronavirus dead body cremation ::

 గాంధీ ఆసుపత్రిలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఇఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనం చేస్తున్నారు . మృతుల  వివరాల నమోదు , అంత్యక్రియల పర్యవేక్షణకు జిహెచ్ఎంసి ముగ్గురు సిబ్బందిని అక్కడ నియమించింది . అయితే మతదేహాలు పూర్తిగా కాలకుండా వదిలేస్తుండటం కలకలం సష్టిస్తోంది . తన తాత అస్థికల కోసం శ్మశానవాటికకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటంతో అవాక్కయ్యారు . ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్ అయ్యాయి .

కరోనా వైరస్ విజంభణతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది . ఐసియులో ఉండే రోగుల సంఖ్య ఆదివారం నాటికి  500 కు చేరుకుంది . వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి . గాంధీ  ఆస్పత్రిలో ప్రస్తుతం 850 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తుండగా , వీరిలో కరోనాతోపాటు వివిధ రుగ్మతలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమారు 500 మందిని  ఐసియులకు తరలించి వెంటిలేటర్లపై ఉంచి  చికిత్స అందిస్తున్నారు .

 కిడ్నీ , లివర్ , ఆస్తమా , షుగర్ , బిపి , గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో కరోనా వైరస్ తీవ్రత  అధికంగా ఉంటుందని , అందుకే వీరిని ఐసియులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని ఆస్పత్రి  సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు . క్రిటికల్ పొజిషన్లో ఉన్నవారు కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని , బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు , సిబ్బంది శక్తివంచన లేకుండా కషి చేస్తున్నారని తెలిపారు . ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు తొమ్మిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించామని , వందశాతం సక్సెస్ సాధించామన్నారు . ప్లాస్మా చికిత్సతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఐదుగురిని డిశ్చార్జ్ చేశామని , మరో నలుగురు కోలుకుంటున్నారని , వారిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వివరించారు . మరో ఐదుగురికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించేందుకు అవసరమైన ప్లాస్మాకణాలు గాంధీ బ్లడ్ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయని , ఐసిఎంఆర్ ఆదేశాల మేరకు వాటిని వినియోగిస్తామన్నారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button