telugu bigg boss

Telugu Bigg Boss Season 5 | Episode 1 Live Updates – Day1

Telugu BB 5 Episode 1

Bigg boss 5 Episode 1: 10:20 PM : ఈరోజు షో లోబో గురక నిద్ర తో మొదలయింది , తర్వాత తెల్లారింది అందరిని జనతా గ్యారేజ్ సినిమా లో ప్రణామం సాంగ్ తో నిద్రపోయిన హౌస్ మెంబెర్స్ ని బిగ్ బాస్ లేపగా అందరు డాన్స్ వేశారు. తర్వాత కాసేపు ముచ్చట్లు , సిరి , జెస్సీ కామెడీ దొంగతనాలు చేసిన సన్నివేశాల ట్రాక్ బాగుంది. తర్వాత నామినేషన్స్ మొదలయి. మొదటిగా శ్రీరామ్ వచ్చి మానస్ మరియు జెస్సీ పై నామినేషన్ వేశారు. సరయు వచ్చి కాజల్ మరియు రవి కి నామినేషన్ వేశారు, ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని. తర్వాత శ్వేతా వర్మ వచ్చి హమీద ని మరియు నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేశారు బ్రేక్.

Overview :- ఎలాగో మొదటి వారం మొదటి రోజే కాబట్టి నామినేషన్లు సీరియస్ గా జరగవు సిల్లీ రీజన్స్ ఏ ఉంటాయి.

10:40 PM :- బ్రేక్ తర్వాత విశ్వ వచ్చి జెస్సీ నీ మరియు మనాస్ నీ నామినేట్ చేశారు. అన్ని మాస్టర్ వచ్చి సిరి ని మరియు జెస్సీ ని నామినేట్ చేశారు. జెస్సీ వచ్చి విశ్వ ని మరియు హమీద ని నామినేట్ చేశారు. తర్వాత రవి వచ్చి నటరాజ్ మాస్టర్ ని మరియు మానస్ ని నామినేట్ చేశారు. తర్వాత ఉమా దేవి వచ్చి కాజల్ ని మరియు జెస్సీ ని నామినేట్ చేశారు. తదుపరి హమీద వచ్చి లహరి ని మరియు జెస్సీ ని నామినేట్ చేశారు. తర్వాత షాను వచ్చి సన్నీ ని మరియు లోబో ని నామినేట్ చేశారు. తదుపరి సన్నీ వచ్చి షాను ని మరియు సరయు ని నామినేట్ చేశారు. ప్రియాంక సింగ్ వచ్చి షాను ని మరియు హమీద ని నామినేట్ చేశారు. తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చి రవి ని మరియు జెస్సీ ని నామినేట్ చేశారు. తర్వాత ప్రియా వచ్చి సిరి ని మరియు కాజల్ ని నామినేట్ చేశారు. బ్రేక్ టైం.

Overview :- ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్ , సన్నీ, జెస్సీ, చేపిన్న రీజన్స్ బాగున్నాయి. మిగుత అందరూ సిల్లీ రీజన్స్ తో ఒక రోజులో సరిగ్గా మాట్లాడలేని వారిని నామినేట్ చేస్తున్నారు… చూడాలి మరి మిగిత సభ్యులు ఏ రీజన్స్ ఇస్తారో..

10:51 PM :- బ్రేక్ తర్వాత లోబో వచ్చి అందరిని నామినేషన్ ప్రక్రియ లో నవ్విస్తున్నారు. లోబో చేసే సన్నివేశాలు కామెడీ ని బాగా పండించాయి. కామెడీ చేస్తూనే లోబో ప్రియాని మరియు రవిని నామినేట్ చేశారు. తర్వాత మానస్ వచ్చి విశ్వా ని మరియు సరయు ని నామినేట్ చేశారు. సిరి వచ్చి హమీద ని మరియు ప్రియా ని నామినేట్ చేశారు బ్రేక్.

Overview :- లోబో నామినేషన్ ప్రక్రియ చాలా కామెడీ గా మరియు ఆహ్లాదకరంగా ఉంది.

11:00 PM :- బ్రేక్ తర్వాత కాజల్ వచ్చి చాల ఎమోషనల్ అయింది, అందరు తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేసినందుకు తర్వాత సరయు మరియు ఉమా ని నామినేట్ చేసింది. లహరి వచ్చి హామిదని మరియు కాజల్ ని నామినేట్ చేశారు.

నామినేషన్ ప్రక్రియ ముగిసాక రవి , మానస్ , సరయు , కాజల్ , హమీద మరియు జెస్సీ ఈ వారం లో నామినేషన్ లో ఉన్నారు.

ఈరోజు బిగ్ బాస్ పెద్దగా ఎంటర్టైన్మెంట్ లా లేదు అనే చెప్పాలి. రేపటి ప్రోమో లో పవర్ హౌస్ మీద టాస్క్ ఉండబోతుందని అర్థం అయింది. పవర్ హౌస్ ఏ సీజన్ లో లేదు కాబట్టి రేపటి ఎపిసోడ్ కొత్తగా మరియు ఎంటర్టైన్మెంట్ తో కూడి ఉంటుంది అని ఆశిద్దాం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button