telugu cinema reviews in telugu language

thimmarusu :- తిమ్మరుసు (2021)

సినిమా :- thimmarusu (2021)

నటీనటులు :- సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, వివా హర్ష, రవిబాబు, అంకిత్ మరియు అజయ్

నిర్మాతలు:- : మహేష్ కొనేరు, శ్రీజన్ యరబోలు

డైరెక్టర్ :- శరణ్ కొప్పిశెట్టి

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో సత్యదేవ్ నటించిన తిమ్మరుసు ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే తిమ్మరుసు వచ్చింది. ఇపుడే సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Thimmarusu Story

ఈ కథ క్యాబ్ డ్రైవర్ ( చైతన్య ) ని హత్య చేయడంతో మొదలయింది. కానీ హత్య చేసినవాళ్ళు అమాయకుడైన వాసు అనే యువకుడు పైన నిందా మోపడం తో వాసు కి 8 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కానీ 8 సంవత్సరాల తర్వాత లాయర్ రామచంద్ర ( సత్య దేవ్ ) మళ్ళి కేసు ని రి ఓపెన్ చేయడం తో అసలైనా కష్టాలు మొదలవుతాయి. అస్సలు క్యాబ్ డ్రైవర్ ని ఎవరు హత్య చేశారు? ఎందుకు వాసు ని ఇరికించారు? ప్రియాంక జవల్కర్ మరియు బ్రహ్మాజీ లు ఎం చేయబోతున్నారు ? అసలు హంతకుడు ఎవరు ? ఇవ్వని తెలుసుకోవాలంటే థియేటర్ లో సినిమా చూసేయాల్సిందే.

Thimmarusu Review

👍🏻:-

  • సత్య దేవ్ తన యొక్క కొత్త కోణాన్ని, కొత్తగా మరియు అందరిని అలరించే విధంగా నటించారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ్ ఇంకో స్టార్ మెట్టు ఎక్కేశారు.
  • బ్రహ్మాజీ మరియు ప్రియాంక తమ పాత్రలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటారు.
  • కథ మరియు కథనం కొత్తగా ఉన్నాయి.
  • దర్శకుడు ప్రతి చిన్న విషయం చాల క్లియర్ గా చూపించేసి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.
  • సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
  • సినిమాటోగ్రఫీ చాల బాగుంది.

👎🏻:-

  • స్లో ఫస్ట్ హాఫ్.
  • ఓవర్ హైప్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి.

Thimmarusu final verdict

మొత్తానికి తిమ్మరుసు అనే చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి లాక్ డౌన్ తర్వాత తెరిచినా థియేటర్లకు మంచి కలెక్షన్స్ వచ్చేలా చేస్తది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. సత్యదేవ్ తన పాత్రలో జీవించేశారు. మాస్ మరియు క్లాస్ సీన్స్ లో తన కొత్త కొణాని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ హాఫ్ స్లో గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఓవర్ హైపె గా అనిపిస్తయి. కానీ సినిమా మొత్తం చూసేశాక సూపర్ అనే మాటే ప్రజల మనసు నుంచి వస్తది. ఈ వారం కుటుంబం తో సహా థియేటర్లకు వెళ్ళి సినిమాని చూసి ఆనందించండి.

రేటింగ్ :- 3/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button