health tips in telugu

అతితక్కువ ఖర్చుతో బాడీ బిల్డింగ్ చేయచ్చు మీకు తెలుసా :-

Health Tips :- బాడీ బిల్డింగ్ కోసం ఇక్కడ లేని కష్టాలు పడుతుంటారు , కొంతమంది అయితే ఏకంగా జిమ్ లోనే ఎక్కువ శాతం సమయం గడిపేస్తుంటారు. సినిమాలో హీరోలను చూసి జిమ్ కి వెళ్లి కండలు పెంచాలని ప్రయత్నించిన వారు కూడా ఉంటారు. కానీ చివరికి ఫలించక నిరసించి బాధపడే వారి సంఖ్యే ఎక్కువ.

ఈరోజు మీకు కొన్ని చిట్కాలు చెప్తాము అది తప్పకుండా పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.

జింలో మనం ఎంత కష్టపడుతున్నామో అంతే ఇష్టంతో కొన్ని అత్యవసరమైన ఆహారాలు కూడా తీసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న బాడీ షేప్ వస్తుంది. కండలు పెంచాలంటే మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏ కావాలి.

  • గుడ్లు మరియు చికెన్ రోజు జిమ్ చేశాక లంచ్ లో తినండి. చికెన్ లో కూడా చికెన్ బ్రెస్ట్ తినడం ఇంకా మంచిది. ఇవి జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక ఇవి మధ్యాహ్నం పూట బాగా తినాలి.
  • వాల్ నట్స్ మరియు పప్పు ధాన్యాలు ఉదయం పూట అయిన రాత్రి పూట అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ రెండు పదార్ధాలలో కొవ్వు అంశాలు తక్కువ మరియు ఫైబర్ , ప్రోటీన్ ఎక్కువ లభిస్తుంది.

ఇలా పై చెప్పబడిన రెండు చిట్కాలు పాటిస్తూ జిమ్ చేయండి మీరు కోరుకున్న కండరాలు కచ్చితంగా వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button