Tollywood news in telugu
ఆగిపోనున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ !

radheshyam కొన్ని రోజులనుండి ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ ఇటలీ లో జరుగుతుంది. షూటింగ్ కోవిడ్ నిబంధనలకు లోబడి జరుగుతుంది. అక్కడ ప్రభుత్వ నిబంధనలు మాత్రం ఈ షూటింగ్ కి ఇబ్బందిగా మారాయి.
రోజు కొన్ని గంటలు మాత్రమే పర్మిషన్ ఉండటంతో నత్తనడకన షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటె యూరప్ దేశాలలో కోవిడ్ ప్రళయం మళ్ళీ మొదలైంది. అందువలన ఆ దేశంలో షూటింగ్ ఆగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి.
యూరప్ దేశం లో ఎంతవరకు వీలయితే అంతవరకూ షూటింగ్ ముగించుకొని వెనక్కు రానున్నారు. యూరప్ దేశం లోని లొకేషన్లలో తీయాల్సిన షూటింగ్, భారతదేశం చుట్టుపక్కల దేశాల్లో తీయాలా, లేదంటే హైదరాబాద్ లోనే సెట్ వేసి తీద్దామా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.