Tollywood news in telugu
ఆదిపురుష్ లో సీతగా అనుష్క శెట్టి ఏ… ఉండాలని కోరుతున్న ఫ్యాన్స్ :-

ఓం రౌత్ దర్శకత్వం లో నిర్మించ బోతున్న “ఆదిపురుష్’ మూవీ లో ప్రభాస్ మొదటిసారిగా ఓ మైథలాజికల్ రోల్ లో కనపడనున్నాడు.
అదీ హిందువుల దేవుడైన రాముని పాత్రలో చేయడం ద్వారా,ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో అని ప్రజలు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తనకి ఈ అవకాశం రావడం ఎంతో అదృష్టంగా బావిస్తున్నాని ఇంతకముందు ప్రభాస్ ఎన్నో సార్లు చెప్పారు.
ఇది ఇలా ఉంటె హీరో ప్రభాస్ తో అనుష్క ప్రయాణం బిల్లా సినిమాతో మొదలై ,బాహుబలి వరకు కొనసాగింది.
ఆదిపురుష్ లో రామునిగా ప్రభాస్ కనిపించనుండగా మరి ఆయన పక్కన సీత పాత్ర ఎవరు చేస్తున్నారనే సందేహం ఆయన ఫ్యాన్స్ మదిలో కదలాడుతుంది.
అయితే అనుష్క శెట్టి అభిమానులు, ఆదిపురుష్ సినిమాలో అనుష్కనే సీతగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ,షోషల్ మీడియాలో వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.