ఆ పైలట్ తో నాకు వ్యక్తిగత పరిచయ ఉందన్న:- పవన్ కళ్యాణ్

కేరళలోన జరిగిన విమాన ప్రమాదం ఫై హీరో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ , ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదానికి సంబందించి శనివారం సాయంత్ర హీరో పవన్ కళ్యాణ్ ప్రకటనను విడుదల చేశారు. విమాన ప్రమాదం లో ఇద్దరు పైలట్లు, 17 మంది ప్రయాణికులు మరణించడం చాల బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఊహించని ప్రమాదం జరగడం ఎంతో బాధాకరమని పవన్ పేర్కొన్నారు. గల్ఫ్ నుండి ప్రయాణం సాగించినవారు ఇండియాకు చేరుకొనే లోపే మృత్యువు ఒడిలోకి చేరుకోవడం హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు .
విమానాన్ని నడిపిన దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ విమాన పయానంలో అనుభవం ఉన్నవ్యక్తులు అని , అయినప్పటికీ ఈ విమానం ప్రమాదానికి లోనుకావడం దురదృష్టకరమని చెప్పారు.
ముఖ్యంగా దీపక్ వసంత్ సాథే వ్యక్తిగతంగా కూడా తనకు తెలుసన్నారు. దీపక్ వసంత్ సాథే కూడా దుర్మరణం పాలవడం తనను ఎంతగానో బాధించిందని . వాయుసేనలో సాథే ఎన్నో సేవలుఅందించారని , సాథే చూపించిన ధైర్య సాహసాలు ఈ భారతదేశం ఎన్నటికీ మరువనదని పేర్కొన్నారు.