ఒక మగాడిని బట్టలు ఉతికే కర్రతో బాది చంపిన మహిళా…. మగాళ్లు జాగ్రత్తగా ఉండండి !

భోపాల్ కి చెందిన ఒక అమ్మాయి తన కన్న తండ్రిని బట్టలు ఉతికే కర్రతో బాది చంపిన సంఘటన జరిగింది.
మగాళ్లకే కాదు మహిళలకి కోపం వస్తే ఎలా ఉంటాదో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు.
అయితే విషయంలోకి వెళ్తే, భోపాల్ కి చెందిన ఈ కుటుంబం కూలీనాలి చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తుంది. ఈ కుటుంబంలో ని వ్యక్తికి ఇద్దరు సంతానం, కొడుకు,కూతురు, తండ్రి తాగుబోతు కావడంతో కొడుకు సంపాదనతోనే ఇల్లు గడుస్తున్న పరిస్థితి.
తండ్రి కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోగా అస్తమానం తాగి వచ్చి భార్యను తిడుతూ,కొడుతూ ఉండేవాడు. ఒక రోజు భార్య కొడుకు ప్రస్తావ తెచ్చి కొడుకు పెద్దవాడు అయ్యాడు పెళ్లి సంబంధాలు చూడాలి అని భర్తతో చెప్పగా , భర్త కోపానికి గురి ఐ భార్యని కొట్టడంతో, అక్కడే ఉన్న కూతురికి కోపం ఆగలేక బట్టలు ఉతికే కర్రతో బాది చంపింది.
వెంటనే పోలీసులకు తనే సమాచారం ఇచ్చి నా తండ్రిని చంపింది నేనే అని ఒప్పుకుంది. పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేసి ఆ మైనర్ బాలికను బాలల శిక్షా కేంద్రానికి తరలించారు.
>> ….. బాలికను బాలల శిక్షా కేంద్రానికి తరలించారు. …..
మంచి పని చేసారు.
కాని ఒక సందేహం! ఆ అమ్మాయి చేసిన తప్పేమిటీ?
ఆ కేంద్రంలో ఏమి నేర్పుతారూ? కుక్కినపేనుల్లా పడుండాలీ, లేకపోతే అది నేరం అవుతుంది అని బాగా బోధించి పంపుతారా?
—
ఆ అమ్మాయికి పౌర సన్మానం చేసి పంపాలి ఇంటికి. అది ఆమెకు ధైర్యాన్ని ఇంకా పెంపొందిస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్న అమ్మాయిలకు దిశానిర్దేశం అవుతుంది. అంతే కాని శిక్షించటం ఏమిటీ దారుణం! ఆ అమ్మాయి చేసిన తప్పేమిటీ?