తెలంగాణ పరభుత్వం పై మరోసారి హైకోర్టు ఆగ్రహం:-

తెలంగాణలో కరోనా కేసులు,మరణాలను తక్కువగా చేసి చూపుతున్నారని. అలాగే ఎక్కువ పీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మార్చి 31 నుంచి ఇప్పటి వరకు కేవలం రోజుకు 8 లేదా 9, 10 మంది మాత్రమే కరోనా బారినపడి చనిపోతున్నారని ప్రభుత్వం రిపోర్టులు ఇవ్వడం మీద కోర్టు అనుమానం వ్యక్తం చేసింది.
డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో తమకు నివేదిక సమర్పించాలని ,పబ్లిక్ హెల్త్ పై ఖర్చు పెట్టిన నివేదికను కూడ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
50 శాతం బెడ్స్ ఢిల్లీ ప్రభుత్వం తరహలో అమలుచేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,478 పాజిటివ్ కేసులు రాగ, వీటితో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది.
అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై 22వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలని కోరింది.