దర్శకుడు పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు …

పోడ్ కాస్ట్ ఆడియోలతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా ఉచిత విద్య, రిజర్వేషన్లు, ఓటు హక్కుపై సంచలన వ్యాఖ్యలు చేసారు .
ఈ నేపథ్యంలో దేశంలో పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదని, కులాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండకూడదని, పేదలకు, నిరక్షరాస్యులకు ఓటు హక్కు తీసేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాటల్లో ఆవేదన, సమాజ స్థితిగతుల పట్ల ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అబ్దుల్ కలాం, రజినీకాంత్ ఇలా కొందరు పేద కుటుంబంలోనే పుట్టారు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు. పేదోడిగా చావడమే తప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్లు తీసుకుని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది.
పేదోడికి ఓటుహక్కు,ఫ్రీ స్కీమ్లు తీసేస్తే వారిలో కొంత మార్పు వచ్చి ,తనకుతాను ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకొనే అవకాశం ఉంటుంది.
కనీస విద్యారహత లేనివారికి ఓటింగ్ తీసేయాలి. అందరూ చదువుకొని ఓటు హక్కు సంపాదించుకోవాలి” అని ఘాటుగా స్పందిచారు.
ఈ వాఖ్యల పై దళిత సంఘాలు పూరీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజం పట్ల బాధ్యతగా మాట్లాడాల్సిన దర్శకుడు పూరీ ఇలాంటి మాటలు మాట్లాడ్డం ఏంటని దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
మన భారతదేశం బాగు పడాలంటే పూరీ వ్యాఖ్యలను సమర్ధించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉంది.