నారప్ప తెలుగు మూవీ – Narappa Telugu Movie

సినిమా :- నారప్ప (2021)
నటీనటులు :- వెంకటేష్, ప్రియమణి , కార్తీక్ రత్నం
నిర్మాతలు:- : కలైపులి స్. తాను , డి. సురేష్ బాబు.
డైరెక్టర్ :- శ్రీకాంత్ అడ్డాల
Narappa Telugu Movie : లాక్డౌన్ సమయం లో ప్రజలకి ఓ టీ టీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.
Narappa Story :-
ఈ కథ అనంతపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో మొదలవుతుంది. నారప్ప ( వెంకటేష్) , తన భార్య ( ప్రియమణి) మరియు ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవించేవారు. ఆ గ్రామా పెద్ద అయినా పాండుసామి , నారప్ప స్థలాన్ని కబ్జా చేయాలనీ పధకం వేశాడు. ఈ విషయం తెలుసుకున్న నారప్ప ఎం చేయకపోయినా , తన పెద్ద కొడుకు అయినా మునికన్నా (కార్తీక్ రత్నం) కి ఎక్కడ లేని కోపం వచ్చి పాండుసామి తో గొడవ పెట్టుకుంటాడు. ఇదిలా ఉండగా కొని అనుకోని విషాదాలు నారప్ప కుటుంబంలో లోటు చేసుకుంటాయి , అయినా కూడా నారప్ప ఓర్పుగా సహనం కొలిపోకుండా ఉంటాడు. ఇదిలా ఉండగా ఈసారి నారప్ప చిన్న కొడుకు అయినా సిన్నప్ప గ్రామా పెద్దతో పగ తీర్చోవడానికి సిద్ధమవుతాడు. ఇపుడు నారప్ప ఎం చేయబోతున్నాడు? అసలు నారప్ప ఎందుకు అని విషాదాలు ఎదురవుతున్న సహనం తో ఉన్నాడు ? నారప్ప అసలు గతం లో ఎం చేశాడు? ఇవ్వని తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.
👍🏻:-
- వెంకటేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. వెంకటేష్ లోని కొత్త కొన్నాని ఈ సినిమాలో మీరు చూస్తారు. ప్రియమణి తన పాత్రకు న్యాయం చేసింది. వెంకటేష్, ప్రియమణి కొడుకులుగా చేసిన ఇద్దరు యువ నటులు తమదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటారు.
- కథ, కధనం మాస్ మరియు ఎమోషన్స్ తో శ్రీకాంత్ అడ్డాల తనదైన డైరెక్షన్ తో ఈసారి గట్టిగా ప్రయత్నం చేసి సక్సెస్ కొట్టాడు.
- మ్యూజిక్ ఓకే కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాలిడ్ గా కోటేశారు.
- సినిమాటోగ్రఫీ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు అందంగా చూపించారు.
- నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
👎🏻:-
- ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ సేపు ఉండటం.
- యంగ్ వెంకటేష్ యొక్క లవ్ ట్రాక్ .
Narappa ముగింపు :-
మొత్తానికి నారప్ప సినిమా మాస్ క్లాస్ అన్ని సెక్షన్ల ప్రజలని అలరిస్తాది. ఎపుడు కామెడీ కె పరిమితం చేసిన వెంకటేష్ ని, దృశ్యం లాంటి సీరియస్ డ్రామా తర్వాత మల్లి యాక్షన్ లోడెడ్ వెంకటేష్ ని చాలా పవర్ఫుల్ గా చూపించారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మల్లి ఈ సినిమా ద్వారా ఫార్మ్ లోకి వచ్చారు. ఓ టీ టీ లో విడుదలయి భారీ విజయం సాధించిన సినిమాలలో మొదటి పేరుగా ఈ నారప్ప సినిమా గురించి చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. మొత్తానికి ఈ వారం కుటుంబం అంత కలిసి మాస్ లోడెడ్ వెంకటేష్ ని హ్యాపీ గా చూసేయండి.
Narappa Rating:- 3.5/5