health tips in telugu
నిద్రపోయే ముందు ఈ ఆహారాలను దూరం పెట్టండి.. లేదంటే ఏమవుతుందంటే !
Sleeping Disorder: మనం రోజూ శరీరానికి అవసరమైన ఆహారాలే కాకుండా అనవసరపు ఆహారాలు కూడా ఎక్కువ తీసుకోవడం వలన మనకు అనేక నిద్ర సమస్యలు మనకు తెలియకుండానే దారి తీస్తున్నాయి. అయితే ఈరోజు మనం నిద్ర పోకుండా చేసే పదార్థాల గురించి ఎవి మనం డిన్నర్ సమయంలో తీసుకోకుంటే ఆరోగ్యంగా సుఖమయంగా నిద్రపోతామో తెలుసుకుందాం.

- డిన్నర్ సమయంలో లో మనం టీ కానీ కాఫీ కానీ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో కెఫిన్ పదార్థం ఉండటం చేత మనకు వచ్చే నిద్ర కూడా రాకుండా చేస్తుంది. ఎవరైనా నిద్ర పోకుండా ఉండాలంటే టీ లేదా కాఫీ రాత్రి పూట తాగచ్చు.
- రాత్రి పూట మనం తినే ఆహారం ఎలా ఉండాలంటే త్వరగా జీర్ణం అయ్యేలా ఉండాలి కాని జీర్ణించుకోవడం కోసం ఎక్కువ సమయం తీసుకునే ఆహారం తీసుకోకూడదు. అలాంటి ఆహారాలలో ముందుగా నాన్ వెజ్. నాన్ వెజ్ నీ రాత్రి పూట తినకుండా ఉంటేనే మంచిది. నాన్ వెజ్ జీర్ణించుకోవడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది.
- చివరిగా జంక్ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ రాత్రి పూటనే కాదు అస్సలు ఏ పుటలో కూడా తీసుకోకుండా ఉంటేనే మంచింది. వీటిలో కొవ్వు పదార్ధాలు మరియు కడుపులో లేనిపోని సమస్యలను తెచ్చే పదార్ధాలు ఉంటాయి.
ఇలా రాత్రి పూట ఈ ఆహారాలకు దూరం ఉంటే మంచిది