ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన హీరో మహేష్ బాబు :-

రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియనివారు ఎవరు ఉండరు , బాహుబలి సినిమాతో ఎంతో పేరుతెచ్చుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు .
అలాగే వర్షం సినిమాలో నటించిన విధానంతో కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగలిగాడు ,కానీ వర్షం సినిమాకి ముందుగా అనుకున్న హీరో మహేష్ బాబు , దర్శకుడు శోభన్ వర్షం సినిమా కథను ముందుగా మహేష్ కి వినిపించాడు కానీ ఈ కథ విన్న మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక పోవడం తో, దర్శకుడు శోభన్ వర్షం కథను హీరో ప్రభాస్ కి వినిపించాడు. ఈ కథలో ని అంశాలు బాగా నచ్చడం తో ప్రభాస్ వెంటనే ఒప్పు కోవడం ,సినిమా మంచి విజయం సాధించడం మనందరికీ తెలిసినవిషయమే ,ఈ విదంగా హీరో మహేష్ నిర్ణయంతో ఈ ఛాన్స్ ప్రభాస్ కి వచ్చి స్టార్ హీరో గా ఎదిగాడు .తరవాత దర్శకుడు శోభన్ మహేష్ తో బాబీ సినిమా చేసాడు అది వేరే విషయం.
ఇపుడు మహేష్ సర్కారీ వారి పాట సినిమా లో బిజిగా గడుపుతున్నాడు . అదేవిదంగా హీరో ప్రభాస్ కూడా రాదే శ్యామ్ సినిమాతో బిజిగా ఉన్నాడు . ఈ రెండు సినిమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి .