ప్రయాణం చేసేటపుడు వాంతుల సమస్యకి చెక్ పెట్టండి
Avoind Vomiting Sensation : సాధారణంగా మనం ప్రయాణాలు చేస్తున్నపుడు మనం తెలియకుండానే మన శరీరం వాంతులా వైపు దారిని మల్లిస్తుంది. అప్పటిదాకా బాగున్న మనము సడన్ గా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వాంతులు చేసుకుంటాం. ఇలా జరుగుతుందని తెలిసి ఇంట్లో వాళ్ళు ఏకడైన టూర్ ప్లాన్ చేసినప్పుడు మనకు పోవాలని ఉన్న మనస్సు చంపుకొని మరి మీరు వెళ్ళి రండి నేను ఇల్లు చూసుకుంటా అని డైలాగ్ వేసేసి సైడ్ ట్రాక్ అయిపోతాం.
అయితే ఇప్పుడు మేము చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలు మీకు ప్రయాణ సమయంలో వాంతులు అవ్వకుండా అపెస్తాయి మరియు మరల మీకు ప్రయాణాల మీద ఆశక్తి కలిగేలా చేస్తాయి. ఇంతకీ ఆ చిట్కాలు ఎంటో తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మ్యాటర్ లోకి వెళ్దాం.

- ప్రయాణాలు చేస్తున్నపుడు ఒంటరిగా కూర్చోవడం, మీకు వాంతులు వస్తాయేమో అనే భ్రమలో ఉంది ప్రయాణం మొదలు పెట్టడం తో ఈ సమస్య మొదలవుతుంది.
ఇలాంటి సమయంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కవారితో మాట్లాడడం లేదు ముందు సీట్ లో కూర్చొని బయట ప్రకృతి ని చూడటం చేయాలి. ఇలా చేస్తే మీ ఆలోచన మారిపోతుంది.
- ఇదే కాకుండా పేపర్ చదవడం , పాటలు వినడం , ఏదైనా కొత్త విషయం గురించి ఆలోచించడం ఇలా మన మైండ్ ని అనేక ఆలోచనలతో ముంచేతుతే వాంతులు అనే ఆలోచన రాదు.
- చివరికి ఎన్నో దశాబ్దాలుగా అందరూ వాడుతున్న చిట్కా ఏంటంటే ప్రయాణం చేసే ముందు కొద్దిగా అల్లం తీసుకోవడం. అల్లం మన శరీరంలో నెగటివ్ సెన్సేషన్ రాకుండా అడ్డు పడుతుంది. కావున ఎప్పుడైనా ప్రయాణాలు చేయాల్సి ఉంటే ముందుగా అల్లం తీసుకొని తర్వాత మేము పైన చెప్పిన చిట్కాలు పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.