Today Telugu News Updates
ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడికి కరోనా…

ప్రపంచ వ్యాప్తంగా రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి .. కరోనా బారిన పడిన బాధితుల్లో ఎక్కువమంది కోలుకుంటున్నారు.. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు మరణిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… సామాన్య ప్రజల నుండి దేశ ప్రధాని వరకు ఒక్కసారైనా కరోనా వైరస్ బారిన పడక తప్పట్లేదు..

అదే విధంగా ఈరోజు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కు కరోనా వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మొదట కొన్ని స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. .కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.గత కొద్దిరోజులుగా తనతో సమావేశమైన అధికార యంత్రాంగం, రక్షణ సిబ్బంది 7 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు కోరారు

