బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ హుల్ చల్ – Bigg boss 5 contestants

Bigg boss 5 contestants ? దేశమంతటా భాషకు సంబంధం లేకుండా ప్రజల హృదయాలను ఆకట్టుకున్న ఒకే ఒక రియాలిటీ షో బిగ్ బాస్. ఏ బాషా లో టెలికాస్ట్ చేసిన ప్రజలను ఇట్టే ఆకర్షిస్తది.
అయితే మన తెలుగు లో కూడా సీజన్ 1 నుంచి గత ఏడాది వరకు వచ్చినా సీజన్ 4 వరకు అన్ని సీజన్స్ హైయెస్ట్ TRP తో ప్రజలని మరింత దగ్గర చేస్తూ వచ్చింది.
ప్రతి సీజన్ లో గొడవలుంటాయి, ఆనందాలతో కూడిన సందర్భాలు ఉంటాయి.. అయితే ఇపుడు సోషల్ మీడియా లో హుల్ చల్ చేస్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్ చుస్తే ఈసారి బిగ్ బాస్ టీం గ్లామర్ డోస్ ఎక్కువ పెంచారేమోనని అనిపించింది. ఇక ఆలస్యం ఎందుకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్ వివరాలు వెల్లడించబోతున్నాం.
Bigg boss 5 contestants
యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, యాంకర్ రవి, ఆర్టిస్ట్ సురేఖ వాణి , సీరియల్ ఆర్టిస్ట్ నవ్య స్వామి , యూట్యూబర్ షణ్ముఖ్, హీరోయిన్ ఇషా చావ్ల , శేఖర్ మాస్టర్ , లోబో , సింగర్ మంగ్లి , యాంకర్ ప్రత్యూష , టిక్ టాక్ స్టార్ దుర్గారావు మరియు ఈసారి జంటగా బుల్లితెర జంట సిద్దార్థ్ వర్మ, విష్ణుప్రియ రాబోతున్నారని విశ్లేష సమాచారం.
పైన చెప్పిన పేరులు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ లిస్ట్ ఎంతవరకు నిజమో వేచి చూడాలి. అయితే ఈ కరోనా కారణంగా ఈ ఏడాది కాస్త ఆలస్యం అయినా కచ్చితంగా సీజన్ 5 ఉంటుంది అని , ఈసారి కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేయబోతున్నారని తెలిసింది. మరిన్ని వివరాలు అతిత్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం.