Today Telugu News Updates

బిజెపికి విషయం లేదు విషమే ఉంది కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బిజెపికి విషయం లేదని , విషం మాత్రమే ఉంది , మతం పేరిట పంచాయితి పెట్టడమే వాళ్లకు తెలుసని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ , మంత్రి కెటి.రామారావు ఆరోపిం చారు.జిహెచ్ఎసి ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా హైదరా బాద్ లోని జలవిహార్‌లో క్రిస్టియన్ కమ్యూ నిటీ సమావేశం సోమవారం జరిగింది . ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొ న్నారు.ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఆరేళ్లలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశామన్నారు . నగర శివా రులో రూ . 2 వేల కోట్లతో మంచినీటి సదుపాయం కల్పించామన్నారు . హైద రాబాద్ స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు 2500 ఆటోలతో చెత్తను తరలిస్తు న్నామని , స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో హైదరాబాద్దీ తొలి స్థానం అని , శుభ్రత విషయంలో ఎక్కడ రాజీపడటం లేదని తెలిపారు . త్వరలో నే సరికొత్త చెత్త సేకరణ వాహనాలు వస్తాయని , రూ 144 కొట్లతో జవహర్ నగర్ డంప్ యార్డు నిర్మిస్తున్నామన్నారు .

వందేళ్లలో హైదరాబాద్ లో మం చి నీటి కోసం ఒక్క రిజర్వాయర్‌ను నిర్మించలేదని ఆరోపించారు . త్వరలోనే కేశవ పురం రిజర్వాయర్‌ను పూర్తి చేసి 2050 వరకు నగరానికి ఎలాంటి నీటి కష్టాలు రాకుండా చేస్తామన్నారు.నగరంలో అందరూ మత సమరస్యం తో ఉంటారని , సిఎం కెసిఆర్ నిజమైన హిందువు అని , అందుకే అన్ని మతాలను ఆదరిస్తారని , గౌరవిస్తారని చెప్పారు . కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభు త్వం రాష్ట్రానికి ఒక్క రూపాయి పనినైనా చేసిందా అని ప్రశ్నించారు . వరద సాయం ఆపిందే బిజెపి అని ఆరోపించారు . ఈ ఎన్నికల తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి క్రిస్టియన్ కమ్యూని ప్రతినిధులత వివరంగా చర్చి స్తానని , అన్ని సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తానని కెటిఆర్ హామీని చ్చారు . ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు డాక్టర్ టి.రాజయ్య , స్టీఫెన్ సన్ , ఎంఎల్ సి రాజేశ్వరరావు , తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button