Today Telugu News Updates
భారత్ లోకి కొత్త కరోనా వైరస్…ఆందోళనలో ప్రజలు

భారతదేశంలో రోజు రోజుకి కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషపడే లోపే కొత్త కరోనా వైరస్ భారతీయులను ఆందోళనకు గురి చేస్తుంది. అసలు విషయం ఏమిటంటే సెప్టెంబర్ లోనే యూకేలో కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రారంభమైంది. దీంతో ప్రపంచ దేశాలు తమ దేశాలకు ఎప్పుడు వస్తుందో అని వణికిపోతున్నారు. ఈ మేరకు భారత్ లో యూకె నుండి విమానంలో వచ్చిన వారిని నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవలే 25 మందికి కరోనా పాజిటివ్ రావడంతో… వారికి కొత్త కరోనా వచ్చిందేమోనని వైద్యాధికారులు అనుమాన పడుతున్నారు. ఈ మేరకు వారి దగ్గర నుండి శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపించారు.