మిత్రపక్షం మజ్లీస్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని , మజ్లీస్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఎంఐఎంతో పొత్తు లేదని , ఈ సారి పాతబస్తీలో అదనంగా మరో ఐదు స్థానాల్లో మజ్లిస్ పార్టీ పైన విజయం సాధిస్తామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ధీమా వ్యక్తం చేశారు . తమ అభ్యర్థినే హైదరాబాద్ మేయర్ అవుతారని , మేయర్ స్థానాన్ని ఎంఐఎంకు ఎందుకిస్తామని , తమకు ఏమైనా పిచ్చా అని అన్నారు . గోల్కొండ కోటపైన సిఎం కెసిఆర్ ఇప్పటికే జాతీయ జెండా ఎగురవేశారని , దీనిపై కాషాయ జెండాలు , కషయ జెండాలు ఎగురవని ఎద్దేవా చేశారు . అభివృద్ధి , సంక్షేమంలో తాము చెప్పింది అబద్దమైతే ప్రజలు తమను శిక్షించాలని , వాస్తవమైతే ఆశీర్వదించాలని కోరారు .
సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంత్రి కెటిఆర్ తో “ మీట్ ది ప్రెస్ ” నిర్వహించారు . ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో పేకాట క్లబ్బులు , గుడుంబా గబ్బు లేదన్నారు . పోకిరీలు , ఆకతాయిల ఆగడాలు లేవన్నారు . శాంతిభద్రతల పరిరక్షణలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదన్నారు . తమ ప్రభుత్వం హైదరాబాద్ లో ఇప్పటివరకు రూ .2 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చామన్నారు . రాజకీయ సుస్థిరత , శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయన్నారు .
గడిచిన ఆరేళ్లలో సామన్యులు , పేదలపై తాము ఒక్క పైసా భారం వేయలేదని , అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమ రూపంలో ప్రజలకు అందజేశామని వివరించారు . తమ హయాంలో ప్రజలపై చార్జీల మోత మోగించలేదన్నారు . హైదరాబాద్ లో రూ . 67 వేల కోట్లు ఖర్చు చేశామని , త్వరలోనే దీనికి సంబంధించిన నయా పైసా లెక్కలను విడుదల చేస్తామన్నారు . హైదరాబాద్ లో ఎటిపిల ద్వారా 1200 ఎంఎల్ డి మురుగునీటిని శుద్ధి వరకు చేస్తామన్నారు . మత విద్వేషాలను రెచ్చగొడితే అణచేస్తాం కొందరు విద్వేష విత్తనాలను నాటేందుకు ప్రయత్నిస్తున్నారని , శాంతిభద్రతలను విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణివేస్తామని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు .
మజ్లీస్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ::
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతియాలని ఎవరు ప్రయత్నించినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు . వరద బాధితులకు ఇప్పటి వరకు రూ .650 కోట్లు అందజేశామన్నారు . ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ , బిజెపి ఏం ఫిర్యాదు చేశారోకానీ వరద సాయం ఆపాలని ఆదేశించి ందని , ఎన్నికలు ముగిసిన తర్వాత అర్హులైన వారికి వరద సాయం అందజేస్తామని వెల్లడించారు . జిహెచ్ఎసిలో తమదే అగ్రతాంబులమని , ఆ తర్వాత రెండవ స్థానంలో ఎవరు ఉంటారనే విషయన్ని బిజెపి , కాంగ్రెస్ తేల్చుకోవాలన్నారు . వరద బాధితులను సిఎం కెసిఆర్ పరామర్శించలేదనడం సరైంది కాదని , రూ . 650 కోట్ల వరద సాయం అందజేసిందే సిఎం కెసిఆర్ అని వివరించారు . కెసిఆర్‌కు చాలా పనులు ఉంటాయని , కానీ గొర్లు గిల్లుకుంటూ కూర్చున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ వరద బాధితులను పరామర్శించేందుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
గెలుపుతో కొందరికి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు . కెసిఆర్ ది వ్యూహాత్మకం..డిసెంబర్ లో ఏం జరుగుతుందో చూద్దాం : కెటిఆర్ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చేసినా వ్యూహాంతోనే చేస్తారని , డిసెంబర్ లో బిజెపి వ్యతిరేక రాజకీయ పార్టీల సమావేశం ఏం జరుగుతుందో చూద్దామని కెటిఆర్ అన్నారు . గ్రేటర్ హైదరాబాద్ లో తాము గెలిస్తే ఎస్ఆర్ఎస్ తొలగిస్తామని బిజెపి చెబుతోందని , దీనిని ఎలా తొలగిస్తారని , రాష్ట్రంలో వారి ప్రభుత్వం లేదని , కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా ? అని తెలంగాణ ప్రశ్నించారు . ఎస్ఆర్ఎస్ స్కీముపై పూర్తి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని , ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే దీనిపై సిఎం కెసిఆర్ తీసుకుంటారని స్పష్టం చేశారు . ఒలికపోయిన పాల గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరమని , దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో సిఎం కెసిఆర్ , మంత్రి కెటిఆర్ పాల్గొంటే సానుకూల ఫలితాలను వచ్చేవనే ఒక ప్రశ్నకు కెటిఆర్ సమాధానమిచ్చారు .