Tollywood news in telugu
మహేష్ బాబు నిర్ణయం… అభిమానులకు పండగే !

maheshbabu కరోనా కారణంగా ఈ సంవత్సరం వృధాగా గడుస్తుంది అనుకున్నాడో ఏమో, తన అభిమానులకు వచ్చే సంవత్సరం సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది.
‘గీతా గోవిందం ‘ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకుడు పరశురామ్ తో హీరో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చేస్తున్నవిషయం తెలిసిందే.
అలాగే ‘అలా వైకుంఠపురం ‘ తో హిట్ తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ రీసెంట్ గా మహేష్ కు ఒక మంచి కథ ను చదివి వినిపించాడట, ఆ కథవిన్నా మహేష్ వెంటనే తన అంగీకారాన్ని తెలియజేసాడని సమాచారం.
అయితే వచ్చే ఏడాది మహేష్ బాబు ఈ ఇద్దరు డైరెక్టర్లతో సినిమా చేసే అవకాశాలు ఉండనున్నాయి. ఇదే గనక జరుగుతే మహేష్ బాబు ఫాన్స్ కి ఒక పెద్ద పండగ రానుంది అని చెప్పవచ్చు.