మా కి ఏకగ్రీవంగా మంచు విష్ణు ?
Will manchu Vishnu become unanimously elected to the maa President

మా అధ్యక్ష ఎన్నికలను చూస్తే అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల పోరును తలపిస్తున్నాయి. ఈ ఎన్నికలను చూస్తే రోజు రోజుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్కంఠ పెరుగుతుంది.. మా అధ్యక్షులుగా పోటీ పడేది అలాట పోలెం కాదు.. అక్కడ పోటీ పడేది ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు బరిలో ఉండగా… మరోవైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పోటీలో ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ‘మా’ కార్యదర్శిగా ఉన్న జీవితా రాజశేఖర్ తాను కూడా మా అధ్యక్ష బరిలో దిగుతున్నట్టు ప్రకటించింది. దీంతో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్ ల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది.. నాకేం తక్కువ ..నేను కూడా మా అధ్యక్ష పదవిలో పోటీ చేయబోతున్నట్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమా ప్రకటించింది.
హేమాకు అంతా ఇండస్ట్రీలో అంత పలుకుబడి లేకపోవడంతో.. ఈమె పోటీలో ఉన్నా లేనట్టే అని చెప్పవచ్చు. అదే విధంగా మంచు విష్ణు విషయానికొస్తే.. మోహన్ బాబు ఉ ఇండస్ట్రీలో అగ్ర నటుడు కాబట్టి ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉంది. అదేవిధంగా ఏపీ సీఎం జగన్, తెలంగాణ ప్రభుత్వంతో మోహన్ బాబు కుటుంబానికి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో మంచు విష్ణు అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంకా మరో పోటీదారుడు ప్రకాష్ రాజ్.. ఈయన తమిళ నటుడు కాబట్టి స్థానికత విషయం అడ్డు వస్తుంది.. తెలుగు ఇండస్ట్రీలో స్థానికులకు ఎక్కువ ఉంటుందని తెలిసిన విషయమే.. అదేవిధంగా ప్రకాష్ రాజు బిజెపి పార్టీకి వ్యతిరేకం.. ఇక్కడ జరిగేది పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్లో కాకపోయినప్పటికీ.. కానీ వాళ్ల సపోర్ట్ కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రకాష్ రాజ్ కి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించాడు.. మనకు తెలిసిన విషయమే..మెగాస్టార్ మద్దతు ఎటు వుంటే అటు ఆ అభ్యర్థి మా అధ్యక్షుడు అవుతాడు.. నాగబాబు ప్రకాష రాజ్ మద్దతు ఇవ్వడంతో.. మెగాస్టార్ సపోర్టు కూడా ఉండే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. మెగా స్టార్ కి మోహన్ బాబు కుటుంబానికి కూడా మంచి సంబంధా లే ఉన్నాయి.. చూడాలి మరి మెగాస్టార్ ఎవరికి మద్దతిస్తారో..
మా అధ్యక్ష రేసులో ఉన్న జీవితా రాజశేఖర్ మా కార్యదర్శిగా పనిచేయడంతో ఇండస్ట్రీలో మంచి క్కాడరే ఉంది.. దీనికితోడు ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్నారు..కగతంలో మెగాస్టార్ రాజశేఖర్ ల మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే .. దీంతో మెగాస్టార్ జీవితా కు మద్దతిచ్చే అవకాశాలు తక్కువేననీ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంకో మరో విషయం కూడా తెరపైకి వచ్చింది… మా ఎన్నికలు లేకుండానే.. ప్రకాష్ రాజ్,జీవిత ల కు మెగాస్టార్ సర్దిచెప్పి..మంచు విష్ణు కి ఏకగ్రీవంగా మా అధ్యక్ష పదవి కట్టపెట్టబోతున్నారని కొందరు చెప్తున్నారు… ముందు ముందు ఏం జరుగుతుందో.. మెగాస్టార్ ఏం చేయబోతున్నాడో అనేది వేచి చూడాల్సిసిందే