Tollywood news in telugu
వకిల్ సాబ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్…

బాలీవుడ్ లోని “పింక్” సినిమాకు రీమేక్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న “వకిల్ సాబ్” చిత్ర షూటింగ్ తుది దశకు వచ్చింది… ఇప్పటివరకు విరామంలో ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ రోజు వకిల్ సబ్ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు.. పవన్ కళ్యాణ్ సెట్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అలాగే ఈ చిత్ర షూటింగ్లో శ్రుతిహాసన్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది…

వకిల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ నివేద థామస్ తో పాటు అంజలి కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి… గబ్బర్ సింగ్ అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు… ప్రస్తుతం ఈ చిత్రాన్ని వేసవికి ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్ర బృందం కసరత్తు చేస్తోంది..

