Tollywood news in telugu
వినాయక మండపాల ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ:-

వినాయక చవితికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్నందువల్ల బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, భారీ విగ్రహాలు ప్రతిష్టించడం చేయవద్దని, ఎవరికి వారు పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని కోరింది.
బుధవారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులతో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, విగ్రహాలు పొడవు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని, ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు.
కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పూజా సామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో కూడా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రజలు అర్థం చేసుకొని పండగని సంతోషంగా జరుపుకోవాలని కోరింది.