Tollywood news in telugu
వైరల్ గా మారిన రానా దగ్గుబాటి బర్త్ డే సీడీపీ !

నిన్న మొన్నటి వరకు విక్టరీ వెంకటేష్, తమిళ స్టార్ రజనీకాంత్ బర్త్ డే విషెష్ ల వెల్లువ షోషల్ మీడియాలో కొనసాగగా, ఇపుడు దగ్గుబాటి రానా బర్త్ డే హంగామా మొదలైంది.
తాజాగా రానా బర్త్ డే సీడీపీ షోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. రానా అభిమానులు , సినీ వర్గాలు రానా కి బర్త్ డే విషెష్ ని తెలుపుతున్నారు.
రానా సీడీపీ ని తాను చేసిన సినిమా పోస్టర్ల ను ఉపయోగించి రూపొందించారు. ప్రస్తుతం రానా ‘అరణ్య ‘, ‘విరాట పర్వం ‘ సినిమా ల షూటింగ్ లో బిజిగా గడుపుతున్నాడు.
రేపు ‘విరాట పర్వం ‘ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.