Today Telugu News Updates
సోనూసూద్ కి మరోసారి 39 మంది చిన్నారుల విషయం లో ప్రశంసల జల్లు:-

సోనూసూద్ తాజాగా 39 మంది చిన్నారుల కాలేయం మార్పిడి చికిత్స కోసం ఫిలిప్పీన్స్ నుంచి న్యూఢిల్లీకి చిన్నారుల ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. కరోనా టైం లో ఎందరికో అండగా నిలుస్తున్న మానవతా వాది సోనూసూద్.
కష్టం ఎక్కడ ఉంటే తాను అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు .
నేడు మనీలా నుండి 39 మంది చిన్నారులతో కూడిన ప్రత్యేక విమానం బయలు దేరి రెండు రోజులలో ఢిల్లీ చేరుకోనుంది. ఈ 39 మందిలో ఫిలిప్పీన్స్కి చెందిన చిన్నారులు ఉన్నారు.
చిన్నారులు అందరు 1–5 ఏళ్ల లోపు వారే. వీరందరూ కొంత కాలంగా బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు.
ఈ చిన్నారులందరికి న్యూఢిల్లీలోని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయనున్నారు. ఇలా చిన్నారుల విషయంలో సోనూసూద్ చూపిన ఔదార్యంపై దేశం లోని ప్రజలు ప్రశంసల జల్లులను కురిపిస్తున్నారు.