telugu facts
హెలోవెన్ – ఆత్మల పండుగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

యుఎస్, యుకె, మరికొన్ని ఏషియన్ కంట్రీస్ లో అక్టోబర్ 31న హాలోవీన్ పండుగను ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియక పోవచ్చు… కానీ మనం ఈ పండుగను హాలీవుడ్ చిత్రాలలో చూస్తుంటాం..అసలకి హాలోవీన్ అనే పదం క్రిస్టియన్ మతం లో నుంచి వచ్చింది… హాలోవీన్ అనగా దయ్యాలు భూతాలకు ప్రార్థన చేయడం…
ఈ హాలోవీన్ పండుగ రెండు వేల సంవత్సరాల కింద ఐర్లాండ్ లో మొదలైంది. ఈ పండుగను ముఖ్యంగా రైతులు తమ పంట కోతలు ముగిసినందుకు గుర్తుగా జరుపుకుంటారు. హాలోవీన్ పండుగ నాడు సూర్యుడు అస్తమించిన తరువాత..ఇటీవలె చనిపోయిన వారు దెయ్యాలు, భూతాలు మారి భూమిపై వస్తారని ప్రజల నమ్మకం. అందుకే ప్రజలు దయ్యాలు,భూతాలు గుర్తు పట్టకుండా ఉండడానికి భయంకరమైన వేషధారణలో ఉంటారు. ఈ పండుగ కోసం గుమ్మడికాయలను దయ్యం రూపంలో చెకి, అందులో క్యాండిల్ ముట్టిస్తారు.