Today Telugu News Updates

ఆశ్చర్య పరిచిన సీఎం కేసిఆర్

ఆశ్చర్య పరిచిన సీఎం కేసిఆర్ సిఎం ఎనికల ప్రసంగం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో శనివారం జరి గిన టిఆర్ఎస్ ఎన్నికల బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షులు , ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం ఆసాంతం సంయమనంతో సాగింది . తన సహ జశైలికి భిన్నంగా ఎక్కడా దూకుడు , కవ్వింపు విమర్శలకు తావు లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారు . భావోద్వేగాలు రెచ్చగొడుతూ బిజెపి ప్రచారం సాగు తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సిఎం వ్యవహరించారు .

ప్రసంగం మొత్తం కేవలం బిజెపి పైనే పరోక్ష విమర్శలు చేశారు . ప్రతీసారి కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడే కెసిఆర్ ఈ సారి మాత్రం ఆ పార్టీపై తన ప్రసంగంలో ఎలాంటి విమర్శలు చేయలేదు . తద్వారా బిజెపి తోనే ప్రధాన పోటీ అనేది చెప్పకనే చెప్పినట్లయింది . అన్నిటికంటే ప్రధానంగా బిజెపి నేతల మాటల వలలో చిక్కొద్దని , అలా చేస్తే హైదరాబాద్ అభివృద్ధి ఆగి పోతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు . వరద సాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదనే అంశాన్ని ఎత్తి చూప డంతో పాటు , మున్సిపల్ ఎన్నికలకు బిజెపి ముఖ్యమంత్రులు , కేంద్ర మంత్రు లు , అధ్యక్షులు క్యూ కట్టి రావడంపై ఆలోచనాత్మక వ్యాఖ్యలు చేశారు .

ఆశ్చర్య పరిచిన సీఎం కేసిఆర్

ఇటీ వల ప్రధానాంశంగా నిలిచిన హైదరాబాద్ వరదలకు పరిష్కారంగా నాలా పథకానికి రూ .10 వేలు చొప్పున బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పడం ద్వారా హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెటే కీలకమనే సంకేతాలిచ్చారు . టిఆర్ఎ సకు దూరమై బిజెపికి ఓటు వేయలేక తటపటాయిస్తున్న ఓటర్లను ఆలోచింప జేసే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు . అంతకుముందు టిఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు మాట్లాడుతూ ఎన్నికలు తమకు కొత్త కాదని , కానీ గ్రేటర్ ఎన్నికలు ప్రాధాన్యత కలిగి ఉన్న దన్నారు .

తాము విలువలతో కూడిన అభివృద్ధి కోరుకుంటే , ఇతరులు విధ్వంసం కోరుకుంటున్నారన్నారు . ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలంటే కెసిఆర్‌ను , టిఆర్ఎస్ ను బలపర్చాలని కోరారు . మంత్రి మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్ మాట్లాడుతూ జంటనగరాల ప్రజలు టిఆర్ఎస్ వైపే ఉన్నార న్నారు . హైదరాబాద్ లో ఒక పిచ్చోడు మాట్లాడుతున్నారని , హైదరాబాద్ లో గెలిస్తే పరిణామాలు మారుతాయంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా రన్నారు .

జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల అభ్యుర్థులు , స్వతంత్ర అభ్యర్థులు తమ పోలింగ్ ఏజెంట్లుగా సంబంధిత వార్డులో ఓటర్లనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది . ప్రచార సమయం ముగిసి పోలింగ్ దగ్గర పడుతుండడంతో ఇక వివిధ పార్టీల అభ్యర్ధులు పోలింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు . తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ ఏజెంట్ల నియామకం పై ఉత్తర్వులు జారీ చేసింది . రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కమిషన్ స్పష్టం చేసింది . పోలింగ్ కేంద్రాల్లో వివిధ పార్టీల అభ్యర్ధుల తరపున ఏజెంట్లుగా ఉండేందుకు , ఏజెంట్లకు రిలీవర్‌గా ఉండే వారంతా సంబంధిత వార్డులో తప్పనిసరిగా ఓటరై ఉండాలని స్పష్టం చేసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button