Today Telugu News Updates

గంజాయి ముఠా గుట్టురట్టు

ఆక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల గంజాయి ముఠా గుట్టురట్టు నలుగురు స్మగ్లర్లను శనివారం టాస్క్ ఫోర్స్ , కేయూసి పోలీసులు అరెస్టు చేసారు . అరెస్టు చేసిన స్మగ్లర్ల నుండి సూమారు 20 లక్షల రూపాయల విలువ గల 200 కిలోల గంజాయితో పాటు గంజాయి రవా ణాకు వినియోగించిన ఒక లారీ , ఒక కారును పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన నిందితులలో సంగారెడ్డి జిల్లా నాగూర్ గ్రామం పోమ్య తండాకు చెందిన వవర్ గణపతి , రంజిత్ , ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామముకు చెందిన దుగ్యాల వినయ్ కుమార్ , కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన గౌస్ ఖాన్ అలియాస్ బబ్లూలు ఉన్నారు.

ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడుల్లో ప్రధాన నిందితు డైన పవార్ గణపతి 2005 సంవత్సరంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తన స్వంత భూమిలో గంజాయి సాగు చేసి పండించిన గంజాయిని కర్నాటక , మహరాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్మేవా డని తెలిపారు . ఈ క్రమములో నిందితుడు గణపతిని కంగ్లి పోలీస్ స్టేషన్ పోలీసులుతో పాటు మహరాష్ట్ర , కర్నాటక రాష్ట్రాల్లో పోలీసులు గణపతిని పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారని తెలిపారు . నిందితుడు గణపతి జైలు నుండి విడుదలయి తిరిగి గంజాయి అక్రమ రవాణాకు చేసేందుకు మరోమారు సిద్ధపడ్డాడని , ఇందులో భాగంగా 2009 సంవత్సరంలో వరంగల్ రూరల్ జిల్లా పర్కాల ప్రాంతంలో అక్రమంగా గంజాయి రవాణాకు పాల్పడటంతో పర్కాల పోలీసులు నిందితుడు గణపతిని అరెస్టు చేసి జైలుకు పంపారని తెలి పారు.

గంజాయి ముఠా గుట్టురట్టు ::

నిందితుడు మరోమారు గంజాయి వ్యాపారాన్ని కోనసాగించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ , ఒడిషా రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో గంజాయిని పెద్ద మొత్తంలో కోను గోలు చేసే క్రమంలో నిందితుడు గణపతికి మరోనింది తుడు దుగ్యాల వినయ్ కుమార్తో పరిచయం ఏర్పడిందని , ఇతని ద్వారా 2018 సంవత్సరంలో నిందితుడు గణపతి ఆంధ్రప్రదేశ్ , ఒడిషా రాష్ట్రాల సరిహద్దులోని ధార కొండప్రాంతంలో గంజాయి కోనుగోలు చేసి వాటిని కారు లో తరలిస్తుండగా మారేడు మిల్లీ పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలిం చగా , నిందితుడు గణపతికి జైలులో తన స్వగ్రామానికి చెందిన లారీ యజమాని ఆయిన మరో నిందితుడు హకీంతో పరిచయం అయిందని , జైలు నుండి విడుద లైన నిందితులు గణపతి , మరోమారు గంజాయి రవాణా చేసేందుకు సిద్ధపడ్డారని తెలిపారు .

ఇందు కోసం నిందితుడు గణపతి మరో నిందితుడు వినయ్ కుమార్తో కల్సి నాలుగు రోజుల క్రితం ధారకొండ ప్రాంతంలో 200 కిలో గంజాయి కోనుగోలు చేసి 2 కి లోల చొప్పున వంద ప్యాకేట్లుగా తయారు చేసి వాటిని కారులో రహస్యంగా రాజమండ్రి , భద్రచలం , కొత్త గూడ , ఏటూరునాగరం , ములుగు , వరంగల్ మీదుగా మహరాష్ట్రకు రవాణా చేసే క్రమంలో వరంగల్ నగ రంలో పోలీసుల తనిఖీల దృష్ట్యా నిందితులు తమ కారు తెచ్చిన గంజాయి ప్యాకేట్లను ములుగు జిల్లా వెంకటా పూర్‌ మండలంతిమ్మపూర్ శివారులోనిందితుడు హకీంకు చెందిన లారీలో సుమారు 50 గంజాయి ప్యాకేట్లను చేర్చి , మరో 50 ప్యాకేట్లను అదే కారులో నిందితులు గంజాయిని రవాణాకు సిద్ధపడ్డారని తెలిపారు .

ఈ క్రమ ములో టాస్క్ఫోర్స్ పోలీసులకు అందిన పక్కా సమా చారం భీమారం అవుటర్ రింగ్ రోడ్డ వద్ద టాస్క్ఫర్స్ మరియు కేయూసి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వ హించే సమయంలో నిందితులు గంజాయి తరలిస్తున్న పైలట్ గా వస్తున్న కారుతో పాటు లారీని పోలీసులు అపి తనిఖీల్లో గంజాయి ప్యాకేట్లను గుర్తించడంతో పోలీసులు నిందితులైన గణపతి , ప్రవీణ్ కుమార్ , రంజిత్ , గౌస ఖాన్లను అదుపులోకి తీసుకోని విచారించగా నింది తులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించారని తెలిపారు . పోలీ సులు అరెస్టు చేసిన గణపతిపై తెలంగాణ , మహరాష్ట్ర , కర్నాటక , అంధ్రప్రదేశ్ , రైల్వే విభాగంతో కలుపుకోని మొత్తం 8 పైగా కేసులు వున్నాయని తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button