Today Telugu News Updates

ప్రచారంలో ఈ రూల్స్ తప్పితే ఇక అంతే…

ప్రచారంలో ఈ రూల్స్ తప్పితే ఇక అంతే… ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది . ప్రచారానికి సంబంధించి పార్టీలు , అభ్యర్థులు వివిధ అంశాలకు సంబంధించి ముందస్తుగా అనుమతి పొందాల్సిన అవిషయంలో స్పష్ట తనిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడు దల చేసింది .

ప్రచారంలో ఈ రూల్స్ తప్పితే ఇక అంతే…

• పోటీచేసే అభ్యర్థులు ప్రచారం నిర్వహించేందుకు అవసరమైన వాహనాలకు ముందస్తు అనుమతి సంబంధిత డిప్యూటీ కమిషనర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది .

• స్టార్ క్యాంపెనర్లు వాడే వాహనాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎన్నికల అథారిటీ , జిహెచ్ఎంసి కమిషనర్ నుంచి ముందస్తు అనుమతి పొందాలి . అనుమతి పత్రంలో స్టార్ క్యాంపెనర్ పేరు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ , వాహనం వాడే తేదీలు , ప్రాంతాల పొందుపరిచి జారీ చేయడం జరుగుతుంది .

• అనుమతి తీసుకోకుండా ప్రచారంలో పాల్గొన్న వాహనాలను అనధికార వాహనాలుగా పరిగణించి సీజ్ చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థి ఐపిసి ప్రకారం శిక్షింపబడుతారు .

• వాహనాల అనుమతి పోటిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజు నుంచి పోలింగ్ కు 48 గంటల ముందు వరకు జారీ చేయనున్నారు .

• పోలింగ్ రోజు ఒక అభ్యర్థికి ఒక వాహనం మాత్రమే అనుమతిస్తారు . ఇందుకు విడిగా వాహన అనుమతి జారీ చేస్తారు . ఈ పర్మిషన్ సంబంధిత డిప్యూటి మున్సిపల్ కమిషనర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది .

• అనుమతి ప్రతిని వాహనం ముందు అద్దంపై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి .

• ట్రాఫిక్ సమస్యలు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎన్ని వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలన్నా నిర్ణయం సంబంధిత అధికారి తీసుకుంటారు .

• ప్రచారంలో రెండుకు మించి వాహనాలు కాన్వయ్ గా ( వరుసగా ) పోరాదు . ఎక్కువ వాహనాలు ఉన్న పక్షంలో ప్రతి రెండు వాహానాలకు మధ్య 100 మీటర్ల దూరం పాటించాల్సి ఉంటుంది . పోలింగ్ రోజున సంబంధిత వార్డులో తిరిగేందుకు పోటిలో ఉన్న అభ్యర్థికి మున్సిపల్ , పోలీసు అధికా రులు విధించే పరిమితుల మేరకు ఒకే వాహనం అనుమతించబడుతుంది . ప్రభుత్వ వాహనాలను ప్రచారంలో కాని , ఎన్నిక లకు సంబంధించిన పనులకు అనధికారికంగా వాడటం నిషేధం .

• లౌడ్ స్పీకర్లు , మైకులు , పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఎన్ని కల ప్రచారానికి పార్టీలు , అభ్యర్థులు ఉపయోగిం చేందుకు సంబంధిత స్థానిక పాలన అధికారి , పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలి .

• లౌడ్ స్పీకర్లు , మైకులు , రోడ్ షోలు , బహిరంగ సభ లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు , రోడ్ షోలు , బహిరంగ సభలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలలోపు , మరే ఇతర తరహా ప్రచారానికైనా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే ఉపయోగిం చాలి .

• ఆసుపత్రులు , విద్యాసంస్థలు , కోర్టు , ప్రార్థనా స్థలా లకు 100 మీటర్లలోపు లౌడ్ స్పీకర్లు , మైకులు ఉప యోగించరాదు .

• ప్రచారానికి వాడే లౌడ్ స్పీకర్లకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి , పోలీసు అధికారులకు లిఖిత పూర్వకంగా అను మతి లేటర్తో పాటు తెలపాలి .

• ప్రచురించిన ప్రతి కరపత్రం , పోస్టరు లేదా ఇతర ప్రచురిత సామాగ్రిపై పబ్లిషరు పేరు , అడ్రసు తప్ప నిసరిగా ముంద్రించాల్సి ఉంటుంది .

• ప్రచురణ కర్త డిక్లరేషన్ తో పాటు ప్రచురించిన 4 పత్రులను ప్రచురించిన మూడు రోజులలోపు జిల్లా మెజిస్ట్రేట్ కు సమర్పించాలి .

• ఎన్నికలకు సంబంధించిన హోర్డింగ్లు , ఫ్లెక్సీలపై కూడా పబ్లిషరు పేరు , చిరునామా ముంద్రించాల్సి ఉంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button