Today Telugu News UpdatesTollywood news in telugu

బంద్ కు TRS మద్దతు , అమెరికాను తాకిన నిరసనలు

‘ భారత్ బంద్’కు టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు… రైతులు ఈ నెల 8 న తలపెట్టిన ‘ భారత్ బంద్ ‘ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుం దని రాష్ట్ర ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు . టిఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు . కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని సిఎం కెసిఆర్ సమర్థించారు . రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కెసిఆర్ ఒక ప్రకటనలో గుర్తు చేశారు . కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు . భారత్ బంద్ విజయవంతం చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు . బంద్ ను విజ యవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కెసిఆర్ ప్రజలకు విజపి చేశారు.

కాలిఫోర్నియాలోనూ నిరసనలు వాషింగ్టన్ : భారతీయ రైతులకు మద్దతుగా అమెరికా వ్యాప్తంగా వివిధ నగరాలలో వందలాది సిక్కు అమెరికన్లు శాంతియుతంగా నిర సన ర్యాలీలు నిర్వహించారు . కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనకారుల కార్ల వరస శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేటకు వెళ్తున్న సమయంలో శనివారం నాడు బే బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది . ఇంకా కొన్ని వందల మంది ఇండియానా పోలిలో వాణిజ్య ప్రాంతంలో పోగయ్యారు . రెండు ప్రాంతాల్లోనూ నిరసనకారులు కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు . అవి భారత రైతులను పేదరికంలోకి నెట్టుతా యని , వ్యవసాయాన్ని కార్పొరేట్ల గుత్తాధిపత్యానికి వదిలిపెడతా యని వాళ్లు అన్నారు . “ ఏ దేశానికైనా రైతులే ఆత్మ . మరి మనం మన ఆత్మను రక్షించుకోవాలి . భారత వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటు రంగానికి అప్పజెప్పే , వ్యవసాయ రంగంలోకి బడా కార్పొరేట్లకు అనుమతించే , పంటల మార్కెట్ విలువను నీరుగార్చే చట్టాల రద్దు కోసం అమెరికా , కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక్కటవ్వాలి ” అని ఇండియానాకు చెందిన గురీందర్ సింగ్ ఖల్సా అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button