Today Telugu News Updates

బట్ట తలను విగ్గుతో కవర్ చేసి పెళ్లి చేసుకున్న ఘనుడు… ఆ విషయం బయటపడ్డాక పెళ్లికూతురు రియాక్షన్ !

ముంబై లో మీరా రోడ్ లో ఉంటున్న 29 సంవత్సరాల ఒక వ్యక్తి కి, పోయిన నెలలో పెళ్లి జరిగింది. హనీమూన్ కూడా అయిపోయింది. తనకి బట్టతల ఉన్న విషయం భార్య దగ్గర దాచిపెట్టి ఈ తతంగమంతా నడిపించాడు.

కొద్దీ రోజుల తర్వాత భర్తకి బట్ట తల అన్నవిషయం బయటపడడంతో నువ్వు ఆ విషయం దాచి నన్ను మోసం చేసావ్ నిన్ను ఎప్పటికి క్షమించను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మహిళకు ఎక్కడలేని కోపం వచ్చి తనవాళ్లకు చెప్పి పోలీస్ లకు ఫిర్యాదు చేసింది.

అలాగే అదనపు కట్నంకోసం వేధిస్తున్నార‌ని కూడా తెలిపింది. భర్త తనపై అనుమానంతో ఫోన్‌ను హ్యాక్‌ చేసి కాల్‌ రికార్డులు, చాటింగ్‌ విషయాలు చెక్‌ చేస్తున్నాడని పోలీసులకు  తెలిపింది.

ఈ కేసును పోలీసులు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button