Tollywood news in telugu

రెచ్చిపోతున్న దళారీలు

ఆరుగాలం కష్టించి పనిచేసిన పత్తి రైతు కు కష్టాలు వెంటాడుతున్నాయి . రెచ్చిపోతున్న దళారీలు ఓవైపు నకిలీ విత్తనాలు , మరోవైపు అతివృష్టి , అనావృష్టితో పంటలు దెబ్బతినగా దాంతో తీవ్ర నష్టానికి గురైన పత్తి రైతులకు మరో కష్టం ఎదురవుతుంది . గత ఏడాది కం టే సంవత్సరం నాగర్ కర్నూల్ జిల్లాలలోని పలు మండలాల్లో ఈ సారి అధికంగా పత్తినిసాగుచేశారు . రైతులతో పాటు రైతు కూలీలు కూడా భూమిని కౌలుకు తీసుకుని సాగుచేయడంతో కూలీల కొరత ఏర్పడింది . దాంతో కూలీ డబ్బులతో పాటు రవాణ ఖర్చులు ఇచ్చి ఇతర మండలాల నుండి వారిని రప్పించుకునే పరిస్థితి ఏర్పడింది . పంటను పండించింది ఒకటైతే కొనుగోలు కేంద్రాలలో రైతుల ముసుగులో దళారులు మాత్రం సందిట్లో సడేమియా అన్నట్టుగా దోచుకుంటున్నారు .

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది . ప్రస్తుతం రైతన్న పరిస్తితి . వర్షాభావ పరిస్థితులతో కొంత కాలం .. ఎడతెరిపి లేని వర్షాలతో పత్తి పంటకు తెగుళ్లు ముసురుకోగా ఆశించిన దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది . ఈ క్రమంలో సేకరించిన పత్తిని విక్రయించాలనుకునే కర్మకులకు సీసీఐ కేంద్రాలు తెరవకపోవడంతో దళారులకు విక్రయిస్తున్నారు . వారు తేమ బూచితో అందినకాడికి దండుకుంటున్నారు దళారులు . రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు రైతుల సంక్షేమం కోసం బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటే మార్కెటింగ్ తీరు మాత్రం విరుద్ధంగా తయారై ంది . సీసీఐ కేంద్రాల జాడ లేకపోవడంతో సందట్లో సడేమియాలా కర్శకుల నోట్లో మట్టికొడుతున్నారు . బతుకమ్మ , దసరా ముందునుంచే కల్వకుర్తి మున్సిపాలిటీలో చిల్లర కాంటా వ్యాపారం జోరందుకుంది .

రెచ్చిపోతున్న దళారీలు ::

మార్కెట్లలోనే పత్తిని కొనుగోలు చేయాలని , ఎక్కడ కొనుగోలు చేసినా సంబంధిత అధికారుల నుంచి కఠిన చర్యలు ఉంటాయని తెలిసిన జోరుగా దందా మాత్రం కొనసాగుతూనే ఉంది . కల్వకుర్తి మండల కేంద్రంలో దళారుల పత్తి దందా మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది . పట్టణంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఉన్న రైతులకు అవగాహన లేకపోవడంతో ఆటోలలో , ట్రాక్టర్లలో పత్తిని తీసుకొచ్చి దళారులకు అమ్ముకుంటున్నారు . ప్రభుత్వం క్విం టాలుకు నిర్ణయించిన 5825 రూ . ధర ఐతే పత్తి నాణ్యత లేదనే సాకుతో ఇదే అదనుగా భావించి 1000 నుంచి 1500 రూ వరకు తక్కువకు తీసుకుంటూ రైతులను మోసగిస్తున్నారు .

క్వింటాలుకు సుమారు రూ.వెయ్యి నుంచి – రూ . 1500 వరకు లబ్ధి పొందుతున్నా రంటే దళారుల సంపాదన రోజుకు లక్షల్లో ఉంది . ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే తేమ సాకుతో పాటు తడిసిన పత్తంటూ దళారులు వారిని నమ్మిస్తున్నారు . మండల కేంద్రంలో హైదరాబాద్ చౌరస్తా మొదలుకొని ఎల్లికల్ చౌరస్తా వరకు ఈ దళారుల తతంగం నడుస్తు న్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నిరేత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు . నెంబర్ ప్లేటు లేని వాహనాలలో రహదారుల గుండా దళారులు పత్తిని రవాణా చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు . రైతే రాజ్యం అన్న ప్రభుత్వం ఈ దళారుల వ్యవ స్తను అనుగదోక్కుతుందా లేదా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందా చూడాలి . ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కట్టే పలిగా నమ్ముకునే రైతులను మోసగించే దళారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటేనే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button