Karnataka Accident: విహార యాత్రకు వెళ్దాం అన్ని అనుకున్నారు… కానీ తిరిగి రాని లోకానికే వెళ్ళిపోయారు
Karnataka Accident: ఓ 20 ఏళ్ల కిందటి చిన్నపటి బాల్య మిత్రులు అందరూ కలిసి విహారయాత్రకు వెళ్దాం అనుకున్నారు.. కానీ విధి వారిని తిరిగి రాని లోకానికి పంపించింది.

కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె కి చెందిన 16 మంది బాల్య మిత్రురాలు అందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా గోవా విహార యాత్రకు టెంపో ట్రావెలర్ మినీ బస్సు లో బయలుదేరారు. దీంతో బస్సులో ఉన్న స్నేహితురాలు అందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వుకున్నారు.

ఈ నవ్వు ఎంతోసేపు లేకుండా పోయింది. వారు ప్రయాణించిన బస్సు డ్రైవర్ ముందట ఉన్న ఓ వాహనాన్ని ఓవర్ చేద్దామనుకుని..ముందట వస్తున్న టిప్పర్ లారీని గమనించక పోవడంతో.. . టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జయింది.
ఈ బస్సు నడుపుతున్న డ్రైవర్ తో సహా 13 మంది మృతి చెందగా… మిగతావారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషాద ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు