ఒక్క బీర్ కి 2.20 లక్షలు….ఎందుకంత కాస్ట్లీ !

మనం ఎపుడైనా హోటల్ కి వెళ్లి భోజనం చేసినా,బార్ లో బీర్ తాగడానికి వెళ్లినా చివరిగా సప్లై చేసినవారికి తోచినంత టిప్ ఇస్తాము .కానీ ఒక బీరు తాగి నందుకు ఏకంగా మూడు వేల డాలర్లు టిప్ ఇవ్వడం ఎపుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఈ సంఘటన అమెరికాలో జరిగింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రెస్టారెంట్లకు, హోటళ్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో నష్టాల బాటలో నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓహియో ప్రాంతంలో కరోనా కేసులు తీవ్రమవుతుడడంతో అక్కడ రెస్టారెంట్లను మూసి వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే 2001 నుంచి బ్రెండన్ రింగ్ అనే అతను ఓహియోలో రెస్టారెంట్ నడుపుతున్నాడు.కరోనా వల్ల నష్టాలతో నడుస్తున్న తన రెస్టారెంట్ ను మూసేయాలని నిర్ణయించుకున్నాడు.ఆ సమయంలోతరచూ ఆ రెస్టారెంట్ కి వెళ్లే ఓ యువకుడు ఒక బీరు ఆర్డర్ చేశాడు.
అయితే ఆ బీర్ విలువ 7 డాలర్లు కాగా. ఆ యువకుడు మాత్రం మూడు వేల డాలర్లను అదనంగా స్వైప్ చేశాడు.
ఇది చుసిన ఆ రెస్టారెంట్ యజమాని ఆ యువకుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అడగగా , ఆ యువకుడు మీరు చూసింది నిజమే 3000 డాలర్లను మీకు టిప్ గా ఇచ్చానని దీనిని ఉపయోగించి మీ రెస్టారెంట్ ను నడపండి అని చెప్పి వెళ్ళిపోయాడు .