3 Roses Series Review and Rating |హిట్టా ఫట్టా :-

Web Series :- 3 Roses (2021) Review
నటీనటులు :- పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ , వైవ హర్ష , సత్యం రాజేష్ , హేమ మొదలగు.
నిర్మాతలు :- SKN ( శ్రీనివాస కుమార్ )
సంగీత దర్శకుడు :- సన్నీ MR
డైరెక్టర్ :- మ్యాగీ
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ):-
ఈ కథ పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ కలిసి క్లబ్ లో మందు కొడుతూ మాట్లాడే సన్నివేశాలతో మొదలవుతుంది. ఇంతలో ఈషా రెబ్బా ( రీతు ) తన ఫ్లాష్ బ్యాక్ తో అసలైన కథ మొదలవుతుంది.
EPISODE1 :- The Girl Next door
రీతు ఒక కంపెనీ లో పని చేసే ఎంప్లాయ్. బ్రిలియంట్ వర్కర్. అలాంటి రీతు కి వల మదర్ హేమ ఫోన్ చేసి కంపెనీ లో ఉద్యోగం మానేసి పెళ్ళి చేసుకో అని మొర పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి సమయం లో రీతు జాబ్ మేసి ఇంటికి వచ్చేశాక వరుసగా రెండు పెళ్ళి చూపులు జరగక రెండు విఫలం అవుతాయి. చిట్టచివరి ప్రయత్నంగా వైవా హర్ష తో పెళ్ళి చూపులు జరగక అనుకొని సంఘటనల చేత హర్ష తో రీతు నిశ్చితార్థం జరుగుతుంది. దీనితో మొదటి ఎపిసోడ్ పూర్తవుతుంది.
EPISODE 2 :- BOLD AND BEAUTIFUL
ఈ కథ పాయల్ రాజ్‌పుత్ ( జాహ్నవి ) నీ యోగ చేసిన తర్వాత మార్నింగ్ పెగ్ వేసే బోల్డ్ అమ్మాయి లా చూపిస్తూ మొదలవుతుంది. ఇంతకీ జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు అని నాన్నమా చెప్పగా తన రూం లో పడుకున్న తన ఫ్రెండ్ నీ లెప్పడం అతనితో రాత్రి మందు తెపించుకొని తాగడం వంటి సన్నివేశాలు జరుగుతాయి. తర్వాత జాహ్నవి కి ఇంట్లో వాళ్ళు ప్రత్యూష్ తో పెళ్ళి చూపులు ఏర్పాట్లు చేయగా జాహ్నవి క్లబ్ లో మీట్ అవ్వడం ఇద్దరు పెళ్ళి చూపులు బదులు రొమాన్స్ లో మునిగిపోవడం జరుగుతుంది.
అలా ఇద్దరు లవ్ లో ఉండి, ఇద్దరి మధ్య జరగాల్సిన తతంతం జరిగాక ప్రత్యూష్ జాహ్నవి తో పెళ్ళి ఇష్టం లేదు లివింగ్ రిలేషన్ షిప్ అయితే ఒక్ అన్నడం తో జాహ్నవి కి ఎక్కడ లేని కోపం వచ్చి ప్రత్యూష్ నీ బోల్డ్ గా తీటేసి సిగరట్ తాగుతూ అడ్డంగా తన తండ్రికి దొరికిపోయింది. ఇక్కడికి తో ఈ ఎపసోడ్ ముగిసిపోతుంది.
EPISODE 3 :- DRAMA QUEEN
ఈ కథ ఇందు ( పూర్ణ ) సూసైడ్ చేసుకుంటున్నట్లు నటిస్తూనే నిజంగానే సూసైడ్ చేసుకోవడం తో మొదలవుతుంది. తర్వాత హాస్పిటల్ లో బాబాయ్ , పిన్ని , ఇందు నీ తీటిపోస్తుంటారు. ఆ సమయం లో ఇందు తను 30 బిలో వయస్సులో ఉన్నప్పుడు రిజెక్ట్ చేసిన పెళ్ళి సంబంధాలు , ఎలా సిల్లీ రీజన్స్ తో పెళ్ళిలు వాయిదా వేసిందని చూపిస్తారు.
ఇప్పుడు 30 ఏళ్లు దాటాక పెళ్ళి చేయమని బాబాయ్ నీ పదే పదే బ్రతిమలాడగా చివరికి సత్యం రాజేష్ తో పెళ్ళి చూపులు ఏర్పాట్లు చేస్తారు. పెళ్ళి చూపుల్లో ఇందు అడిగిన బోల్డ్ ప్రశ్నలకు రాజేష్ బోల్డ్ పనులు కష్టం అంటాడు. దానితో ఇందులో రాజేష్ నీ తిట్టేసి , ముఖం మీద కాఫీ పోసి వెళ్ళిపోతుంది.
అలావెళ్ళిపోతున్న సమయం లో సీన్ మొదటి ఎపిసోడ్ తో లింక్ అవుతుంది. అదే పూర్ణ, పాయాల్ , ఈషా ముగ్గురు ఫోన్ లో లైఫ్ గురించి తిట్టుకొని క్లబ్ లో కలుసుకందామని చెప్పుకొని క్లబ్ లో ఎంటర్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్.
EPISODE 4:- THE MADNESS BEGINS
ఈ ఎపసోడ్ రీతు జిమ్ లో ఉన్నపుడు మ్యూజిక్ వాయించేవాడు ఎలా ఫ్లార్ట్ చేశాడో తలుచుకుంటూ ఉండగా , సడెన్ గా సీన్ రీతు వాష్ రూం లో ఇదంతా గతం లో జరిగిన సన్నివేశాలు ఊహించుకుంటూ వాష్ రూం లోనే ఉందిపోగా మిగితా వారు ( జాహ్నవి , ఇందు ) కలిసి బయటికి రా అని మెసేజ్ చేయగా రీతు బయటికి రావడం తో ఎపిసోడ్ మొదలవుతుంది.
ఇప్పుడు ముగ్గురు కలిసి మందు కొడుతూ వారి వారి బాధలు పంచుకుంటూ , ఒదర్చుకుంటు ఉన్న సన్నివేశాలతో సాగుతుంది. తర్వాత ముగ్గురు ఫుల్ గా తాగేసి ఎవరి ఇళ్లకు వారి వెళ్ళిపోయారు.
మరుసటి రోజు ఒక పక్క రీతు వైవా హర్ష తో షాపింగ్ కి వెళ్ళింది. ఇంకో పక్క జాహ్నవి మీద వాల నాన్న కోపంగా ఉన్నారు, జాహ్నవి ఆఫీస్ కి వెళ్లి తన నాన్న కి క్షమాపణ చెప్పగా కూల్ అయ్యి ఇంకో పెళ్ళి సంబంధం చూస్తా అన్నారు. మరో పక్క ఇందు రాత్రి తాగింది కక్కుకుంటు ఉంటుంది.
చివరిగా రీతు హర్ష తో ఫక్ యూ అని చెప్పడం తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
మరో కొత్త ఎపిసోడ్స్ నవంబర్ 19 న రాబోతున్నాయి.