Tollywood news in telugu

30 rojullo preminchadam ela trailer : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ట్రైలర్ రిలీజ్…..కామెడీతో, డాన్స్, రొమాన్స్ తో అదిరిపోయింది !

30 rojullo preminchadam ela trailer

30 rojullo preminchadam ela trailer  : ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ హీరో గా నటించిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, ట్రైలర్ విజయ్ దేవరకొండచేతులమీదుగా  రిలీజ్ అయింది .

గతేడాది ఈ సినిమా నుండి వచ్చిన ‘నీలి నీలి ఆకాశం’ అనే సాంగ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిన విషయమే, ఇపుడు ఈ సినిమా ట్రైలర్ వచ్చిందంటే ఇంక ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఈ సినిమాలో అమృతఅయ్యార్ హీరోయిన్‏గా నటించగా ,  మున్నా కొత్త దర్శకుడుగా పరిచయం కానున్నాడు. మూవీ ని   గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. కరోనా కారణంగా సినిమా విడుదల కాకపోవడంతో ప్రదీప్ అభిమానులు నిరాశకు గురిఅయ్యారు, ఇపుడు ఈ సినిమా ట్రైలర్ రావడంతో సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  

ఈ ట్రైలర్‏లో చుస్తే పునర్జన్మల లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది అని తెలిస్తోంది. ఇందులో  హర్ష , భద్రం, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 29 న సినిమా విడుదలకానుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button