5th week eliminated contestant : అనుకున్నది ఒకటి అయిన్నది ఒకటి : బిగ్ బాస్ ఎలిమినేషన్ :-

5th week eliminated contestant : బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రేక్షకులు అనుకున్నట్లు ఏ ఒకటి జరగట్లేదు, ఆలా అని అటు కంటెస్టెంట్స్ కూడా ఊహించినవి జరగడం లేదు అని ప్రతి వారం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
మొదటి వారం లో ఎలిమినేట్ అయినా సరయు నుంచి మొన్న ఎలిమినేట్ అయినా నటరాజ్ మాస్టర్ వరకు ఏ ఒక వారం కూడా ఊహించిన వాలు , కంటెస్టెంట్స్ గెస్ చేసిన వాలు ఎలిమినేట్ కాకపోగా సేఫ్ అయ్యి అందరికీ షాక్ మీద షాక్ ఇస్తున్నారు.
దీని కారణంగా నామినేషన్ లోకి కంటెస్టెంట్స్ రావాలంటే భయపడుతున్నారు. ఆలా అని ప్రతి సోమవారం నామినేషన్ ప్రక్రియ అయితే జరగకుండా ఆగదు కదా. ప్రతి వారం లాగే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈసారి ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. వారు లోబో , సన్నీ , హమీద , మానస్ , ప్రియా , జెస్సీ , యాంకర్ రవి , షణ్ముఖ్ , విశ్వా. వీరందరిలో ఎక్కువ మంది ద్వారా నామినేట్ అయినా కంటెస్టెంట్ షణ్ముఖ్.
అయినా ప్రజలు ఎవరెవరు ఎలా ఆడుతున్నారో చూసి మరి ఓట్లు వేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈవారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ. ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయేది హమీద అని సోర్సెస్ చెప్తున్నాయి. అయినా హమీద వెళ్లిపోవడమే కరెక్ట్ అనిపించేలా చేసింది.
దీనికి గల కారణం నిన్నటి ఎపిసోడ్ లో షణ్ముఖ్ చెప్పిన రీజన్ ” అసలు ఈవారం హౌస్ లో హమీద కనిపించలేదు ‘.. షణ్ముఖ్ కె కాదు బయట ప్రేక్షకులకి కూడా కనిపించలేదేమో ఓట్లు రాకపోవడం తో హమీదని ఎలిమినేట్ చేసారని తెలుస్తుంది.
ఏదేమైనా హమీద ఎలిమినేట్ అవడం వళ్ళ శ్రీరామ్ చంద్ర తన ఆట ఇప్పటినుంచి అయినా ఆడుతాడేమో చూడాలి.