movie reviews

KGF సినిమా కి పాజిటివ్ టాక్

KGF సినిమా మీద కొన్ని అభిప్రాయాలు ఈ కథనంలో..

ఒకప్పటి లాగా కాకుండా ఇప్పుడు కన్నడ హీరో యశ్ కథానాయకుడుగా ఐదు భాషలలో నిన్న విడుదలైన చిత్రం కేజీఎఫ్.తెలుగులో తనకు మొదటి సినిమా అయినా కుడా కథా కథనం బాగుండటం తో దీని బిజినెస్ సహా కొన్ని ప్రమోషన్ లు స్టార్ డైరెక్టరు రాజమౌళి చేయడం తో సినిమా మీద మొదటి నుండే ఆసక్తి కనబరిచారు మన తెలుగు ప్రేక్షకులు.

కథ బాగుంది.స్క్రీన్ ప్లే కుడా కొన్నిసీన్లల్లో తప్ప మిగిలింది అంతా ఒకే అంటున్నారు విశ్లేషకులు.అయితే బిజినెస్ పరంగా కుడా పెద్ద హీరోలతో పోటీ పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.కథాంశం ఒక తల్లీ కోరికను తీర్చే కొడుకుగా ఛత్రపతి సినిమాను పోలి ఉన్నా కుడా ఇది కోలార్ గనుల చుట్టు తిరిగిన కథాంశం.

మొదటిసారిగా ఒక కన్నడ హీరో సినిమా ప్రపంచ వ్యాప్తంగ రెండువేల పైబడి స్క్రీన్ ల మీద విడుదల కావడం సినిమా మీద అంచనాలున్నాయి.తెలుగులో వారహి చలన చిత్రము వారు,సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ఇక్కడ బాగా ప్లాన్ చెసారు.సినిమా చూసిన వారు ఎక్కువ పాజిటివ్ టాక్ చెప్తున్నారు.చాలామంది యశ్ నటనను మెచ్చుకుంటారు చూస్తే అంటు నెటిజన్ లు కుడా ఎక్కువ పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నారు.కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నా కుడా సినిమా ఫస్ట్ హాఫ్ క్లాస్ గా సెకండ్ హాఫ్ మాస్ గా సాగుతుంది.
మన విశ్లేషకులు అభిప్రాయం 3/5.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button