A Love Letter to Nikhil : నిఖిల్ కి కౌంటర్ గా లవ్ లెటర్ ఇచ్చిన అమ్మాయి:-

A Love Letter To Nikhil : హీరో నిఖిల్ ఎపుడు తనదైనా మార్క్ నటనతో అందరిని అలరిస్తూ వచ్చారు. అయితే ఈసారి ఆఫ్ఘనిస్తాన్ కి జరిగిన పరిస్థితి చూసి ట్విట్టర్ ని వేదికగా తీసుకొని అమెరికా అధ్యక్షుడైన జో బిడ్డెన్ ని తిడుతూ ఓ ట్వీట్ వేశారు అదేమనగా ” ఫ్రీ వరల్డ్ అనే ఉదహరణగా అమెరికా… అది ఇపుడు పోయింది. 21 సంవత్సరాలుగా ఒక దేశాన్ని ఇబ్బంది పెడుతూ ఇపుడు ఇలా చేస్తారా ? ఇంకోసారి ఫ్రీడమ్ అనే అంశం గురించి మాట్లాడు బిడ్డెన్ చెప్పు తెగ్గుది ఎదవా ” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందిస్తూ రామ దేవి అనే అమెరికా మహిళా నిఖిల్ కు బహిరంగ కడిగేస్తూనే ఇది ప్రేమగా చెప్తున్నా అని చెప్పింది..
రామ దేవి ట్విట్టర్ లో నిఖిల్ ని ఈ విధంగా ప్రశ్నించింది. ” ఒక 78 ఏళ్ళ వయసు గల మనిషిని , దానికి తోడు ఒక దేశపు ప్రెసిడెంట్ ని నువ్వు చెప్పు తెగ్గుది ఎదవా అని బహిరంగ చెప్పావు ఇది ని సంస్కారం ఓకే.
ఇపుడు నువ్వు నిజంగానే హీరోవి అయితే ఒక దేశం కోసమే ప్రెసిడెంట్ ని తిట్టావ్ కదా.. మీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం అయినా జగన్ మోహన్ రెడ్డి సినిమా టికెట్ రేట్స్ విషయం లో చాలా కఠినంగా ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోతోంది గా దీని నువ్వేంచేయలేవా సీఎం ని ప్రశ్నిస్తూ ట్యాగ్ చెయ్ చెప్పు తెగ్గుది ఎదవా అని..
సరే ఇది పక్కన పెట్టు ఒక సభ ముఖంగా నందమూరి బాలకృష్ణ ” ఆడది కనిపిస్తే కడుపు చేయాలి అన్నారు ” దీనికి నువ్వు ట్వీట్ చేయగలవా చెప్పు తెగ్గుది బాలయ్య అని.
రాంగోపాల్ వర్మ ప్రతిసారి మెగా ఫామిలీ పైన అసభ్యకరంగా ట్వీట్స్ వేస్తూ ఉంటాడుగా దాని నువ్వు ఖండిస్తూ ట్వీట్ చేయలేవా చెప్పు తెగ్గుది వర్మ అని..
ఇవేం చేయలేవు కానీ అమెరికా ప్రెసిడెంట్ ని నిలతీయడానికి హీరోఇజం చుపియడానికి వచ్చావ్. అసలేం తెలుసు నీకు. గత రెండేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అమెరికా పన్ను డబ్బులు స్వాధీనం చేసుకొని ఎం చేశారో తెలియదా. అమెరికా అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ .
అంతెందుకు ప్రజలకు తోడుగా ఉండి, ధైర్యం ఇయాల్సిన ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ఏ తాలిబాన్లకు భయపడి ముందస్తుగా పారిపోయాడు. అతని తిట్టలేవా మరి చెప్పు తెగ్గుది ఎదవా అని . .
ఒకరిని ఖండిస్తున్నాం అంటే ముందు వెనకాల ఏంటి అని తెలుసుకొని మంచిగా ఆలోచింపచేసేలా ట్వీట్లు పెడితే బాగుంటుంది ఇలా వల్గర్ గా మాట్లాడితే ఎం రాదు. ఇది నెగటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా ఆలోచించండి.
ఇట్లు రామ దేవి ( USA) ” అని నిఖిల్ కు ప్రేమతో రాస్తున్నాను అని సంబోధించారు. చాల ఘాటుగా మరియు ఆలోచనలో పడేలా రాసిన ఈ ట్వీట్ పై నిఖిల్ ఎలా స్పందిచబోతున్నాడో చూడాలి.