Tollywood news in telugu
ప్రముఖ సంగీత దర్శకుడికి అరుదైన గౌరవం !

ప్రముఖ సంగీత దర్శకుడు , ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు . బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ( బాప్టా) ఈ అరుదైన గౌరవాన్ని ఏఆర్ రెహమాన్ కు అందజేసింది.
బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ ఇకనుండి నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఇండియా లో ఉన్న ప్రతిభావంతులైన ఆర్టిస్టులను గుర్తించాల్సి ఉంటుంది. బాఫ్టాతో కలిసి పనిచేయబోతున్నందుకు చాల సంతోషంగా ఉందని రెహమాన్ తెలిపాడు .
సినిమాలు, కళలు, క్రీడలు, బుల్లితెర వంటి పలు రంగాల్లోని అద్భుత ప్రతిభ చూపినవారిని గుర్తించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని రెహమాన్ తెలిపారు.