Tollywood news in telugu

ఆది పురుష్ లో అల్లు అర్జున్ లక్ష్మణుడిగా …. హనుమంతుడిగా రానా … ఇంకా లిస్ట్ చూస్తే సినిమా ఫ్యాన్స్ కి నిజమైన పండగే

aadi purush starcast: “బాహుబలి” చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనన్ని ప్రపంచానికి చెప్పిన ఘనత జక్కన్న కే దక్కుతుంది… ఈ చిత్రంలో హీరోగా నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ సౌత్ ఇండియా స్టార్ నుండి ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయారు … యువత లో ప్రభాస్ కి భారీగా క్రేజ్ పెరిగిపోయింది… సినిమాల కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు…

బాహుబలి తర్వాత తీసిన సాహూ చిత్రం ప్రభాస్ కి మంచి సక్సెస్ ని ఇచ్చింది… ఆ తర్వాత ప్రభాస్ ఏ చిత్రంలో నటిస్తాడని ప్రభాస్ అభిమానులు వేచి చూస్తున్నారు… కానీ ఇటీవలే ప్రభాస్ “ఆది పురుశ్” చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు… ఇటీవలే చిత్ర బృందం టీజర్ కూడా విడుదల చేసింది దీంతో ఆ టీజర్ ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు పెరిగిపోయాయి…

ఈ చిత్రంలో రావణ , లక్ష్మణ, హనుమంతుని కరాక్టర్స్ ను ఎవరు చేస్తే బాగుంటుందన్ని సినీ ప్రేమికులు తెగ ఆలోచిస్తున్నారు… పలువురు సినీ నిపుణులు ఈ క్యారెక్టర్ కి ఎవరు బెస్ట్ గా సెట్ అవుతారనేది చాలా గొప్పగా చెప్పారు..
ఆది పురుష చిత్రంలో శ్రీ రాముని పాత్ర కు రెబల్ స్టార్ ప్రభాస్ తప్ప మరెవ్వరికీ సెట్ కాదని కరాఖండిగా చెప్పేస్తున్నారు…


మరి సీత పాత్రలో సౌత్ హీరోయిన్ అయితే కీర్తి సురేష్ అతికినట్టు ఉంటుందన్నారు… అలాగే కొందరు నిపుణులు అనుష్క శెట్టి కూడా సీత పాత్రలో బాగా నటిస్తారని అంటున్నారు… ముఖ్యంగా అనుష్క శెట్టి ప్రభాస్ జోడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు….


అలాగే లక్ష్మణుడు పాత్రకి బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ న్యాయం చేయగలడని భావిస్తున్నారు.. అలాగే సౌత్ యాక్టర్ అయితే గోన గన్నారెడ్డి అనే క్యారెక్టర్ తో రుద్రమదేవి సినిమాని రక్తి కట్టించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అద్భుతంగా సెట్ అవుతాడన్నారు…

అలాగే హనుమంతుడు పాత్రకు సౌత్ నుండి అయితే బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన దగ్గుపాటి రానా కరెక్ట్ గా సరిపోతాడని నిపుణులు భావిస్తున్నారు… బాలీవుడ్లో అయితే రణవీర్ సింగ్ తదితర హీరోల పేర్లు వినిపిస్తున్నాయి..

మరో బలమైన పాత్ర రావణాసురుడు ఈ పాత్రకు టాలీవుడ్లో అయితే విక్రమ్ బాగా సెట్ అవుతాడని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు… బాలీవుడ్లో అయితే సలిఫ్ ఖాన్ పేరు ప్రచారంలో ఉన్నాయి..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button