Romantic Movie Review – ఆకాష్ పూరి , కీటిక శర్మ

Movie :- Romantic (2021) Review
నటీనటులు :- ఆకాష్ పూరి , కీటిక శర్మ , రమ్య కృష్ణ , మందిరా బేడి, మకరంద్ దేశ్‌పాండే, దివ్యదర్శిని
నిర్మాతలు :- పూరి కనెక్ట్స్ ( పూరి జగన్నాథ్ , చర్మ )
సంగీత దర్శకుడు :- సునీల్ కశ్యప్
డైరెక్టర్ :- అనిల్ పాదూరి
Release Date : 29th October 2021
- ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా ప్లాబడితే తగ్గినా చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com ki mail cheyandi…… be aware of frauds and fake people
Story ( Spoiler Free):-
ఈ కథ రమ్యకృష్ణ వాస్కో డి గామా ( ఆకాష్ పూరి ) గురించి చెప్పడం తో మొదలవుతుంది. వాస్కో మరియు యని చిన్ననాటి స్నేహితులు , వాస్కో ఇల్లీగల్ గుండాయిజం చేస్తునందుకు పోలీసులు అరెస్ట్ చేసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. వాస్కో మారడు. వాస్కో ఒక గ్యాంగ్ లో జాయిన్ అయ్యి డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు. అయితే ఒకానొక సందర్భం లో వాస్కో తన గ్యాంగ్ హెడ్ నే చంపేస్తాడు.
ఇప్పుడు వాస్కో నే కొత్త కంపెనీ పెట్టి ఇల్లీగల్ మత్తుపదార్థాలు సప్లై చేసే దందా మొదలుపెడతాడు. ఇలా లైఫ్ హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్న సమయం లో వాస్కో కి మౌనిక పరిచయం అవుతుంది. వాస్కో కి మౌనిక పై కోరికలు వస్తుంటాయి. ఆలా కాలం గడిచే కొద్దీ శాంసంగ్ అనే ఇంకో దందా దారూడు తన దందాను వాస్కో నాశనం చేసాడని , తన మాల్ వాస్కో దొంగాతనం చేసాడని కోపం తో వాస్కో ని చంపడానికి ప్లాన్ వేస్తాడు.
ఇంకో పక్క వాస్కో ఎంతగానో ఎదురు చుసిన తరుణ అదే మౌనిక తో రొమాన్స్ చేస్తున్న సమయం రానే వచ్చింది. వాస్కో మౌనిక తో రొమాన్స్ చేస్తుండగా సడెన్ గా శాంసంగ్ మనుషులు ఎటాక్ చేస్తారు. వాస్కో వీళ్ళతో గొడవపడుతున్న సమయం లో రమ్యకృష్ణ తన డిపార్ట్మెంట్ పోలీసులని వెంటేసుకొని వచ్చింది. రమ్యకృష్ణ కి మౌనిక దొరికిపోయింది. వాస్కో మరియు యని పారిపోయారు. మౌనికని రమ్య తీసుకొనిపోవడంతో బ్రేక్.
అసలు వాస్కో ఎవరు ? ఎందుకు ఇల్లీగల్ దందా చేయాలి , రౌడీ అవ్వాలని చిన్నపటినుంచి ప్రయత్నిస్తున్నాడు ? వాస్కో కి మౌనిక ఎలా పరిచయం అయ్యింది ? వీరిద్దరి మధ్య రొమాన్స్ జరగడానికి వాస్కో పడిన కష్టాలు ఏంటి ? అస్సలు వాస్కో మత్తుపదార్థాలు ఎందుకు అమ్మాలనుకున్నాడు ? దీని వెనకాల ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ? రమ్యకృష్ణ వాస్కో ని పట్టుకుందా లేదా ? రమ్య మౌనిక ని పట్టుకొని ఎం చేసింది ? మౌనిక కోసం వాస్కో వచ్చాడా లేదా ? అస్సలు వీరిద్దరూ ప్రేమించుకున్నారా లేదా ? వాస్కో ని పట్టుకున్నక రమ్య ఎం చేయబోతుంది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- ఆకాష్ పూరి మరియు కిటిక శర్మ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కిటిక శర్మ మొదటి సినిమా అయినా ఎక్కడ తడబడకుండా చాల బాగా పాత్రలో జీవించారు. ఆకాష్ పూరి వాస్కో డి గామా పాత్రలో మునిగిపోయి ప్రేక్షకులని అలరించాడు. రమ్యకృష్ణ సినిమాకి కావలసినంత ఎనర్జీ ని ఇచ్చింది.
- సినిమా యొక నిడివి.
- కథ మరియు కధనం. పూరి మార్క్ డైలాగ్స్. దర్శకుడు బాగా హ్యాండిల్ చేసారు. చివరి 30 నిముషాలు ది బెస్ట్.
- సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బాగుంది.
- మ్యూజిక్ ఓకే.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎 :-
- సినిమా కాస్త స్లో గా ఉంటుంది.
- రెండు పాటలు మినహా మిగితావి పెద్దగా అలరించవు.
Overall :-
మొత్తానికి రొమాంటిక్ సినిమా ఆడియో లాంచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు కుటుంబం అంత కలిసి వెళ్ళి చూసే సినిమా. సినిమా లో కొన్ని సన్నివేశాలు బోల్డ్ ఉన్నపటికీ కథ మరియు కధనం చాల బలంగా పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. ఆకాష్ పూరి మరియు కిటిక శర్మ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రమ్యకృష్ణ మరియు మిగితా పాత్రధారులు సినిమాలో వారి పాత్రకు న్యాయం చేసారు. చివరి 30 నిముషాలు ది బెస్ట్. పూరి మార్క్ డైలాగ్స్. దర్శకుడు బాగా హ్యాండిల్ చేసారు.
నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కాస్త స్లో గా ఉంటుంది. పాటలు కూడా సినిమాకి పెద్దగా ప్లస్ అవ్వదు. ఒక రెండు పాటలు మినహా. మొత్తానికి రొమాంటిక్ సినిమా యువతనే కాకుండా కుటుంబం అంత వెళ్ళి చూసే లవ్ స్టోరీ. ఈ వారం కుటుంబం అంత కలిసి పూరి గారి మార్క్ సినిమా చూసేయచ్చు.
Rating :- 3 /5