Today Telugu News Updates
Academic Calendar :అకాడమిక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసిన విద్యాశాఖ !

Academic Calendar : తెలంగాణలో కరోనా వల్ల మూత పడ్డ విద్యాలయాలు తెరచుకోబోతున్నాయి. విద్యాశాఖ ఈ ప్రకటన విడుదల చేయడంతో అటు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ప్రయివేటు ఉపాధ్యాయులు ముఖం లో అదేవిదంగా చాల రోజుల తరువాత తమ స్నేహితులను కలవబోతున్న చిన్నారి విద్యార్థులు ముఖం లో చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి.
అయితే ఇంకా కరోనా తగ్గనందున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్య సంస్థలను నడపాలని ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 1 నుండి 9,10 ఆ పై తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎఫ్.ఏ-1 మార్చి 15, ఎఫ్.ఏ-2 ఏప్రిల్ 15 నాటికీ పూర్తి చేయాలని, మే 7 నుండి 13 వరకు 9 వ తరగతి సమ్మేటివ్ అసెస్మెంట్ నిర్వహణ, మే 17 నుండి 26 వరకు పదవ తరగతి పరీక్షలు, 27 నుండి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించనుంది.