EntertinementTollywood news in telugu

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా పోస్ట్ పోన్ : Acharya Movie Postponed

Acharya Movie Postponed

అవును ఫిబ్రవరి 4 న విడుదలకు సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ లా ఆచార్య సినిమా అకస్మాత్తుగా విడుదల వాయిదా వేసేశారు.

ఇప్పటికే ఈ సినిమా ఎన్నో సార్లు అనేక కారణాల చేత పోస్ట్ పోన్ అయిన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల చేయడానికి సరైన డేట్ కుదరకపోతుంది.

అయితే ఈ సినిమా ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగడంతో మరియు అన్ని రాష్ట్రాల వారు నైట్ కర్ఫ్యూస్ , 50 % ఆక్యుపెన్సీ పెట్టడం చేత ఈ సినిమా అనుకున్న తేదీన అనగా ఫిబ్రవరి 4 న విడుదల కాలేకపోయింది.

బయట పరిస్థితులు కొంచెం బెటర్ అయ్యాక కొత్త విడుదల తేది ప్రకటిస్తారు అని ఆచార్య చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.

చూడాలి మరి ఆచార్య కొత్త విడుదల తేది ఎప్పుడు ఉండబోతుందో మరి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button