acharya movie : ‘ఆచార్య’ షూటింగ్ కి బ్రేక్… ఇక సినిమా ఇప్పట్లో లేనట్టేనా…!

Acharya Movie shooting : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. మొన్నటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా సాగిన షూటింగ్ సడెన్ గా మధ్యలోనే బ్రేక్ పడింది. ఎక్కువ వేడి ఉండటం వలన చిరుకు డీహైడ్రెషన్ జరిగినట్లుగా సమాచారం. ఈ సందర్బంగా షూటింగ్ మధ్యలోనే చిరంజీవి హైదరాబాద్ కి వెళ్లిపోయారని గుసగుసలు వినపడుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో ఇల్లందు బొగ్గు గనులలో కొన్ని చిరుకు సంబంధించిన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ గనులల్లో మార్చి 15 వరకు షూటింగ్ జరగాల్సి ఉండగా , అక్కడ మూడు రోజుల్లోనే షూటింగ్ నుంచి చిరు హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ఈ షూట్ లో చిరు తో పాటుగా రామ్ చరణ్ కూడా చిత్రీకరణలో పాల్గోంటున్నాడు.

ఇదిలా ఉంటె.. ఆచార్య చిత్ర యూనిట్ కి సమ్మర్ సెగలు తాకినట్టున్నాయి. ఎండాకాలం మొదలుకావడంతో ఉష్ణోగ్రతలను భారీగా నమోదవుతున్నాయి. ఇక అక్కడి బొగ్గు గనుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో … అధిక వేడి కారణంగా చిరు స్వల్ప అస్వస్థతకు గురయినట్లుగా సమాచారం. ఈ కారణంగానే షూటింగ్కు కాస్త విరామం చెప్పి .. హైదరాబాద్ వెళ్ళారట చిరంజీవి.
ఈ సందర్బంగా సినిమా చిత్రీకరణ నిలిచిపోయిందని తెలుస్తుంది. దీనికి తోడు .. మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమాలో బొగ్గు గనుల్లో చిరంజీవికి సంబంధించిన సీన్లు కంప్లీట్ కావడంతో అక్కడి నుండి చిరు హైదరాబాద్ వెళ్లారని మరో టాక్. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తుంది. ఇందులో రామ్ చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రలలో కనపడనున్నారు.

అదేవిదంగా ఇందులో విలన్ పాత్రలో రియల్ హీరో సోనూసూద్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. అలాగే మరొక విలన్ గా బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే… ‘ఆచార్య’ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.