ఇది పరిస్థితి, అందుకే విషం తాగా: Actor Tirthanand Rao

మన జీవితంలో ఎపుడు ఎలాంటి సమస్యలు వచ్చిన ఎదురుకోని నిలబడే శక్తిని ఇచ్చిన దేవుడు , ఒంటరితనం , చిన్నచూపు చూడటం, సొంత మనుషులు మాట్లాడకపోతే మాత్రం ఈ ప్రపంచం లో మేము ఎందుకు ఉన్నాం అనే ఆలోచన వచ్చి ఆత్మ హత్య చేసుకొనే పరిస్తితి దాకా మన మనస్సు వెళ్ళిపోతుంది.
అయితే గత 2 ఏళ్లుగా కరోనా వళ్ళ ఎందరో మంది ఉపాధి కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచం లో ఎన్ని ఉపాధి కలిపించే సంస్థలు ఉన్న ప్రజలు ఒక పని పోతే ఇంకో పని వెతుక్కునే సత్తా ఉంది. కానీ ఒక్క సినిమా పరిశ్రమ మనుషులకు మాత్రం ఒక ఉద్యోగం లేకుంటే ఇంకో ఉద్యోగం ఉంటుందా అనే ఆలోచన ఉంటుంది.
ఎందుకంటే సినిమా పరిశ్రమ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ , సినిమానే నమ్ముకున్న వారిని ఎటువంటి బాధ కలగకుండా చూసుకుంటుంది. అయితే కరోనా పుణ్యమా అని షూటింగ్స్ లేక, ఉపాధి లేక, ఆర్టిస్టులు రోడ్ న పడ్డారు.
తినడానికి తిండి లేక , ఒకరి దగ్గర చెయ్యి చాపలేక లోలోపల కుమిలిపోతున్నారు. అలాంటి ఆర్టిస్టులు లోనే కమెడియన్ తీర్థానంద్ రావు ఒక్కరు.
ఇతను గత నెల అంటే డిసెంబర్ 21 న విషయం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అయితే గడియలు బాగుండి చుట్టూ పక్క వారు వెంటనే ఆస్పత్రికి తరలించి బ్రతికించారు.
అయితే ఇప్పుడు అతనికి ఈ విషయం గురించి అడగగా ఆయన ఈ విధంగా స్పందించారు. ” అవును నేను ఆత్మ హత్య ప్రయత్నం చేసిన విషయం నిజమే. ఎందుకంటే ఇంత వయస్సు వచ్చిన కుటుంబానికి అండగా , తోడుగా ఉండలేకపోతున్నాను. ఉపాధి లేదు, చేతిలో డబ్బులు లేవు , అప్పులో మునిగి తేలుతున్నాను. ఇదిలా ఉండగా నేను ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా ఎవరూ చూడటానికి కూడా రాలేదు. నా తల్లి , కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. అస్సలు నేను ఉన్న ఏరియా లో నాతో మాట్లాడటానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు. ఇలాంటి జీవితం ఉంటే ఎంత పోతే ఎంత అనిపించే విషం తాగాను అని వెల్లడించారు.
కమెడియన్ తీర్థానంద్ రావు గారు కపిల్ శర్మ షో లో మరియు గుజరాతీ సినిమాలో నటించారు. అయితే ఇతని గొంతు నాన పటేకర్ లా ఉండటం తో డబ్బింగ్ పనులు కూడా చేస్తుంటారు. ఇలా అనేక విధాలుగా పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.