ఎంత ఫేమ్ వచ్చిన అస్సలు గాసిప్ లేని హీరోయిన్లు వీరే !
actress without gossips :: ఈ రోజులలో ఒక వ్యక్తి సెలబ్రిటీ అయ్యాడంటే…అతని మీద రూమర్స్, గాసిప్స్, గాలి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి… కానీ ఇప్పటివరకు కొందరు అగ్ర నటులపై ఒక్క గాసిప్ కూడా లేదంటే మీరు నమ్ముతారా …! ….తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లపై రూమర్స్ అసలే లేవు…
★గౌతమి:-
ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో మెరిసిన గౌతమీ…ఇప్పటికి వరకు గాస్సిప్స్ కి తావు ఇవ్వలేదు…ఆమె చిత్ర షూటింగ్ కి వాళ్ల తల్లి తో వచ్చి… షూటింగ్ ప్యాక్ అప్ చెప్పిన తర్వాత మళ్ళీ తల్లితోనే వెళ్ళిపోయేది…

★సుమలత:-
సుమలత పలు చిత్రాలో నాయకి గా మంచి పాత్రలు చేసిన… ఆమె మాత్రం అగ్ర హీరోయిన్ కాలేకపోయింది…..ప్రస్తుతం వివాహం చేసుకొని భర్తతో స్థిరపడింది…ఇప్పటికీ ఈమె పై ఒక్క రూమర్ కూడా లేదు

★ఊహ
ఊహ మొదట పలు చిత్రాల్లో నటించిన…ఆ తర్వాత హీరో శ్రీకాంత్ ని వివాహం చేసుకుని… సెటిల్ అయిపోయింది… ఇప్పటికీ ఈమె పై ఒక గాలి వార్త లేదు…

★ సుజాత
సుజాత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవసరం లేని పేరు….ఎన్నో సినిమాలో స్టార్ హీరోయిన్ గా, అగ్ర హీరోలకు తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది…ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఆమె మరణించేంతవరకు ఇప్పటి వరకు ఒక గాసిప్ కూడా లేదు…

★నమ్రతా శిరోద్కర్:
నమ్రత మొదట మిస్ ఇండియా కిరీటం దక్కించుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది… ఆమె చిరంజీవి హీరోగా నటించిన అంజి చిత్రంలో హీరోయిన్ గా నటించింది… అనంతరం వంశీ సినిమాతో మహేష్ బాబు తో పరిచయం ఏర్పడింది.. .ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి… పెళ్లికి దారితీసింది
ఆ తర్వాత నమ్రత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసింది… ఇటీవల సుశాంత్ సింగ్ రాజపుత్ డ్రగ్స్ విషయంలో నమ్రత పేరు బయటకి రాగా… ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. నమ్రతా పై ఆ ఒక్క గాసిప్ తప్ప… ఇంకా ఏ గాసిప్ లేదు

★ రేణు దేశాయ్:-
రేణు దేశాయ్ మొదట పలు చిత్రాల్లో హీరోయిన్ నటించారు… రేణు దేశాయ్ ,పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏడేళ్లుగా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల వారిద్దరు విడిపోయారు. కానీ ఇప్పటివరకు రేణు దేశాయ్ పై ఒక్క గాసిప్ కూడా లేదు

★ భూమిక
ఎన్నో చిత్రాలో స్టార్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది… కానీ స్టార్ హీరోయిన్ అన్ని ఎప్పుడు పరిధి దాటి ప్రవర్తించలేదు…ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది… భూమిపై ఒక్క రూమర్ కూడా లేదు ..
