1000 మంది గర్ల్ ఫ్రెండ్స్…1000 సం,,లకు పైగా జైలు శిక్ష…. అసలువిషయం ఇది !

Adnan Oktar Jailed: 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ,10 క్రిమినల్ కేసులు,69,000 అబార్షన్ లు ఇవన్నీ ఒక పేరుమోసిన వ్యాపారి అనుకుంటే పొరపాటే, వీటన్నకి గల కారకుడు ఒకే ఒక వ్యక్తి, తన వెనకాల ఉన్న మనుషులు, అతను టర్కీకి చెందిన ముస్లిం మత గురువు ‘అద్నాన్ ఓక్తర్’. ఇతనికి ఒక ‘కల్ట్’ అనే మత సంస్థ ఉంది. ప్రజలందరూ సరిఅయిన మార్గంలో నడవాలని బోధించే మతగురువే అనేక నేరాలకు పాల్పడ్డాడు.
ఇతనికి ఇపుడు టర్కీ కోర్టు 1000 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది. ఇతను మైనర్ బాలికలపై అలాగే మహిళలపై అత్యాచారాలు చేయడం, రౌడీలను తయారు చేయడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటివి చేస్తున్నాడని ఆరోపణల దృష్ట్యా ఓక్తర్ కి శిక్ష వేశారు.
ఇతడు మహిళలను పెంపుడు జంతువుల కు పెట్టె పేర్లను పెట్టి పిలిచేవాడని , అంతేకాకుండా అతడి చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉండేవారని, తనకు సుమారు 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఓక్తర్ స్వయంగా జడ్జికి ముందు ఒప్పుకున్నాడు.
ఇతడి వద్దనుండి సుమారు 69,000 గర్భనిరోధక మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని చర్మ అలెర్జీలు, రుతుస్రావాల ఇబ్బందులు ఉన్నపుడు బాలికలపై వాడానని తెలిపాడు. 2018లో ఓక్తర్‌కు సంబందించిన 78 మంది అనుచరులను కూడా అరెస్ట్ చేసారు. ఇతని అనుచరులతో సహా అందరికి కలిపి 1000 సం,,లకు పైగా జైలు శిక్ష పడింది.