పెళ్లి తర్వాత … మళ్లీ ప్రేమ పెళ్లి…
ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. వారు వేరే అబ్బాయికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ తర్వాత మళ్లీ అదే కుటుంబ సభ్యులు మరోసారి ప్రేమించిన అబ్బాయితో అమ్మాయి కి ఇచ్చి రెండో పెళ్లి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా కేంద్రంలోని కుసుమంచి మండలం నర్సింహులు గూడెంకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు…నేలకొండపల్లి మండలం చెరువు మాదారంకు చెందిన యడవల్లి పావని అనే అమ్మాయి ఇరువురు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమని అమ్మాయి వాళ్ల కుటుంబ సభ్యులకు నిరాకరించారు. దాంతోపాటు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళి చేశారు. దీంతో పెళ్లియిన కొద్దీ రోజులకే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్ని తెలియడంతో పెళ్లి చేసుకున్న భర్త విడాకులు ఇచ్చాడు.
దీంతో ఆ అమ్మాయి పావని షీ టీం సీఐ అంజలిని ఆశ్రయించింది తన ప్రేమ వివాహం గురించి సిఐ కి తెలియజేసింది. దీంతో సీఐ అంజలి ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి స్టేషన్లో నే ప్రేమించిన అబ్బాయితో పావని కి పెళ్లి చేసింది.