Tollywood news in telugu

Again New Cases on Shankar : శంకర్ పై మరో కేసు :-

Again New Cases on Shankar

Again New Cases on Shankar : అసలు ఈ ఏదాది శంకర్ కి అస్సలు బాలేదు ఏమో. ముట్టుకున్నా , పట్టుకున్న , ఆలోచించిన ఏది చేసిన రివర్స్ లో అయన మీదే కేసులు పడుతునే ఉన్నాయి. కరోనా ముందు కమల్ హస్సన్ తో ఇండియన్ 2 భారీ లెవెల్ లో ప్లాన్ చేసి సగం సినిమా పూర్తవకముందే అనివార్య కారణాల వాళ్ళ అయిపోయింది.

సరే అని బాలీవుడ్ లో ట్రై చేద్దాం అని అక్కడ వెళ్ళి అపరిచితుడు 2 రణవీర్ సింగ్ తో ప్లాన్ చేస్తే , అపరిచితుడు సినిమా నిర్మాత కేసులు మీద కేసులు వేయడంతో ఆ సినిమా ఆలోచన అడ్రస్ లేకుండా పోయింది.

సరే అని టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మాతగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా భారీ లెవెల్ లో సినిమా ప్లాన్ చేశారు. అంత మంచే జరుగుతుందని సెప్టెంబర్ 8 న ఈ సినిమా ముహూర్తం కూడా ఖరారు చేశారు. సడన్ గా శంకర్ పై మరో కొత్త వివాదం వచ్చిచేరింది. ఈసారి రాంచరణ్ సినిమా పైననే ప్రభావం చూపించింది.

అదేంటంటే శంకర్ రామ్ చరణ్ తో తీయాలన్న కథ చెన్నై లోని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్న చిన్నస్వామి తాను రాసుకున్న కథ అని, అది విజయ్ కోసం రాసుకున్నది కానీ ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో ముందుకు కొనసాగలేదు. అయితే కార్తీక్ సుబ్బరాజు మరియు శంకర్ కలిసి రామ్ చరణ్ కోసం కథ రాశారు అని చెప్తున్నారు. నిజానికి అది నేను రాసుకున్నది వీరు దొంగలించారు అని సౌత్ ఇండియా ఫిలిం రైటర్ అసోసియేషన్ లో కేసు నమోదు చేసారు చిన్నస్వామి.

అసోసియేషన్ ఈ కేసు పై విచారణ మొదలుపెటింది. కాబట్టి రాంచరణ్, శంకర్ లా సినిమా అనుకున్న తేదీన ముహూర్తం జరగదు. విచారణ ముగిసేవరకు సినిమా కి సంబందించిన ఏ ఒక పని జరగకూడదు అని ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఈ సినిమా ముహూర్తం పోస్ట్ పోనే చేశారు.

చూడాలి మరి శంకర్ ఈ కేసు నుంచి ఎలా బయటపడుతాడో. అసోసియేషన్ ఎటువంటి తీర్పునివ్వబోతుందో అని వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button